iDreamPost

Krish Srikkanth And Nagarjuna : సినిమాకు క్రికెట్ కు దోస్తీ ఎలా కుదిరింది

Krish Srikkanth And Nagarjuna : సినిమాకు క్రికెట్ కు దోస్తీ ఎలా కుదిరింది

మొన్న శుక్రవారం విడుదలైన 83 దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ తో ఆడుతోంది. ఇండియాకు మొదటి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ నేపధ్యాన్ని కథాంశాన్ని తీసుకుని దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుకుంటుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ సినిమా చూసిన ప్రతి క్రికెట్ లవర్ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి అడిగిన వాళ్లకు పాజిటివ్ గా చెప్పడం మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున అందించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చేశారు.

ఈ సందర్భంగా క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ తను నాగార్జున క్లాస్స్ మేట్స్ అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంజనీరింగని చెప్పారు కానీ అంతకు మించి వివరాలు ఇవ్వలేదు. దీంతో అభిమానులకు ఆసక్తి పెరిగింది. అసలు విషయమేంటో చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు గారు కుటుంబంతో మదరాసులో ఉన్న టైంలో నాగార్జున గుండీ ప్రాంతంలో ఉన్న కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో మెకానికల్ బ్రాంచ్ లో చేరారు. కానీ రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కొనసాగలేకపోయారు. ఆ టైంలో శ్రీకాంత్ నాగ్ కు క్లాస్ మేట్. ఇక్కడ డిస్ కంటిన్యూ అయ్యాక నాగార్జున మిచిగన్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని అందుకున్నారు

ఆపై ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలా పేరుకి నాగార్జున శ్రీకాంత్ ఒకే కాలేజీ అయినప్పటికీ నాలుగేళ్ల పాటు ఈ బంధం కొనసాగలేదు. ఈ జ్ఞాపకాలనే మొన్న శ్రీకాంత్ స్టేజి మీద పంచుకున్నారు. 83 వరల్డ్ కప్ జరిగిన రెండేళ్లకు నాగార్జున విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. శివ నాటికి శ్రీకాంత్ స్టార్ క్రికెటర్. తన స్నేహితుడు శివగా బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపించడం తనను ఆశ్చర్యపరిచిందని కూడా శ్రీకాంత్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఈయన త్వరగానే రిటైర్ అయిపోయి ఇతర వ్యాపకాల్లో పడిపోయారు కానీ నాగార్జున మాత్రం ఇప్పటికీ హీరోగా బంగార్రాజు, ఘోస్ట్ సినిమాలు చేస్తుండటం గమనార్హం

Also Read : RRR : ఆందోళన చెందుతున్న ఆర్ఆర్ఆర్ బృందం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి