iDreamPost

Free Journey: మహిళలకు RTCలో ఉచిత ప్రయాణం.. నేటి నుంచి అవి తప్పనిసరి.. లేకపోతే అంతే

  • Published Dec 15, 2023 | 11:02 AMUpdated Dec 15, 2023 | 11:22 AM

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత బస్‌ ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి జీరో టికెట్లు జార చేస్తారని.. అందుకు సంబంధించిన విధి విధానాలు వెల్లడించారు. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత బస్‌ ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి జీరో టికెట్లు జార చేస్తారని.. అందుకు సంబంధించిన విధి విధానాలు వెల్లడించారు. ఆ వివరాలు..

  • Published Dec 15, 2023 | 11:02 AMUpdated Dec 15, 2023 | 11:22 AM
Free Journey: మహిళలకు RTCలో ఉచిత ప్రయాణం.. నేటి నుంచి అవి తప్పనిసరి.. లేకపోతే అంతే

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీలు.. హస్తం పార్టీ గెలుపులో కీలక పాత​ పోషించాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే బాధ్యతలు స్వీకరించగానే.. ముందుగా మహిళలకు ఉచిత ప్రయాణ, చేయూత వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నారు. మిగిలిన వాటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళలకు ఉచిత ప్రయాణినికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఆ వివరాలు.

తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ను తీసుకుని సంస్థకు సహకరించాలని సజ్జనార్ కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం టీఎస్ఆర్టీసీ సజ్జనర్ వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.

Free travel in RTC for women

ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు . ఎలాంటి ఫిర్యాదులు రాకుండాప్రశాంతంగా ఈ పథకం అమలవుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను ఆర్టీసీ సంస్థ..సాప్ట్‌వేర్‌ను ప్‌డేట్ చేసిందని తెలిపారు. ఆ సాప్ట్‌వేర్‌ను టిమ్ మెషిన్లలో ఇన్‌స్టాల్ చేయనున్నట్టు తెలిపారు. మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను జారీ చేస్తుందని తెలిపారు.

ఈ క్రమంలో శుక్రవారం నుంచి మహిళా ప్రయాణికులు జీరో టికెట్‌ తీసుకోవడం కోసం రేపటి నుంచి.. తమ వెంట ఆధార్, ఓటరు, తదితర (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన) గుర్తింపు కార్డులను కచ్చితంగా తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తెలంగాణ వారే, స్థానికులు అనే తెలియడం కోసం వాటిని కండక్టర్లకు చూపించి.. ఆ తర్వాత జీరో టికెట్లను తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ సంస్థపైఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు.

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు తెలిపారు ఎండీ సజ్జనార్‌. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని కోరారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసి.. అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను ఈ సందర్భంగా సజ్జనార్ అభినందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి