iDreamPost

నాలుగు డిగ్రీలు, PHD పట్టా.. చివరకు కూరగాయలు అమ్ముకుంటున్నాడు.. ఎందుకంటే..?

దేశంలో అక్షరాస్యత శాతం పెరుగుతోంది. చదువుకున్న వారు ఎక్కువౌతున్నారు. మరీ ఉద్యోగాలు చూస్తే నిల్. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలే కాదూ.. ప్రైవేట్ సంస్థల్లో కూడా గడ్డుకాలం నడుస్తోంది. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో కడుపునింపుకునేందుకు చిన్న చితకా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు బాగా చదువుకున్న వ్యక్తులు.

దేశంలో అక్షరాస్యత శాతం పెరుగుతోంది. చదువుకున్న వారు ఎక్కువౌతున్నారు. మరీ ఉద్యోగాలు చూస్తే నిల్. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలే కాదూ.. ప్రైవేట్ సంస్థల్లో కూడా గడ్డుకాలం నడుస్తోంది. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో కడుపునింపుకునేందుకు చిన్న చితకా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు బాగా చదువుకున్న వ్యక్తులు.

నాలుగు డిగ్రీలు, PHD పట్టా.. చివరకు కూరగాయలు అమ్ముకుంటున్నాడు.. ఎందుకంటే..?

నేటి కాలంలో చదువుకున్న చదువుకు.. చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండటం లేదు. చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి స్టడీస్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టిన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో.. దొరికిన చిన్న చితకా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. అరకొర జీతాలతో నెట్టుకొస్తున్నారు. సింగిల్ లైఫ్ అయితే ఓకే.. ఫ్యామిలీ ఏర్పడితే.. ఈ వేతనంతో బ్రతకడం చాలా కష్టం. ప్రభుత్వ కొలువులు ఉండటం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు చేసినా.. పర్మినెంట్ కాకపోవడం, వేతనాన్ని పెంచకపోవడంతో బ్రతుకు బండిని నడిపేందుకు మరో మార్గాన్ని అన్వేషించక తప్పడం లేదు.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూశారా.. ఫ్యామిలీని నడిపేందుకు ఉద్యోగాన్ని వదిలేసి.. కూరగాయలు అమ్ముకుంటున్నాడు. అయితే ఏ డిగ్రీ, పీజీ చేశాడనుకుంటున్నారేమో.. అంతకంటే ఎక్కువే చదివారు. పీహెచ్‌డీ హోల్డర్. డాక్టరేట్ పట్టా పొందిన నాలుగు డిగ్రీల ఈ వ్యాపారి పేరు సందీప్ సింగ్.. పంజాబ్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. అయితే పీహెచ్‌డీ చేస్తే ఏంటీ.. అందుకు తగ్గట్లు ఉద్యోగాలు లేకపోవడంతో.. 11 ఏళ్లుగా పాటియాలాలోని పంజాబీ యూనివర్శిటీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగానికి వస్తున్న జీతం తక్కువ.. అది కూడా సమయానికి అందడం లేదు. దీంతో తన కుటుంబాన్ని పోషించేందుకు కూరగాయలు అమ్మడం మొదలు పెట్టారు.

తన ప్రొఫెషన్‌ కు గుడ్ బై చెప్పి.. ఒక బండిని తీసుకుని కూరగాయలు అమ్మడం ప్రారంభించారు. ఆ బండికి పీహెచ్‌డీ సబ్జి వాలా అనే బోర్డు పెట్టాడు. ఇప్పుడు సందీప్ చెబుతున్న దాని ప్రకారం.. ఉద్యోగం కన్నా బిజినెస్ బాగుందట. ప్రొఫెషర్ జాబ్ కన్నా ఇందులోనే ఎక్కువ వస్తున్నాయని వెల్లడించారు. అలా అని తన చదువును ఎక్కడా అశ్రద్ధ చేయట్లేదు. వీలు కుదిరినప్పుడల్లా స్టడీస్ పై దృష్టి సారిస్తున్నానని అన్నారు. కూర‌గాయ‌లు అమ్మగా వ‌చ్చిన డ‌బ్బుల్లో కొంత దాచి, త్వర‌లోనే ట్యూష‌న్ సెంట‌ర్ తెరువాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరి పీహెచ్‌డీ చేసిన ఈయన.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి  కూరగాయల వ్యాపారంలో అడుగుపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి