iDreamPost

Pratibha Patil: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే పూణేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారలు కీలక అంశాలను ప్రస్తావించారు. బుధవారం రాత్రి నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యుల తెలిపారు.

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే పూణేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారలు కీలక అంశాలను ప్రస్తావించారు. బుధవారం రాత్రి నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యుల తెలిపారు.

Pratibha Patil: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖల ఆరోగ్యానికి సంబంధించిన వార్తలకు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వివిధ కారణాలతో కొందరు ప్రముఖులు మరణిస్తున్నారు. అలానే మరికొందరు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చేరారు. అలానే గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా కాలికి ప్రమాదం జరిగి  ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని పుణెలోని భారతీ హాస్పిటల్ లో చేరారు. బుధవారం రాత్రి నుంచి ప్రతిభా పాటిల్ చికిత్స పొందుతున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌ కారణంతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం  ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ప్రతిభా పాటిల్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. భారతదేశానికి రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పని చేశారు. అలానే రాష్ట్రపతి పదవి చేపట్టిన మొట్ట మొదటి మహిళగా ప్రతిభా పాటిల్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె యూపీఏ ప్రభుత్వ హాయాంలో 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు.

గతంలో ప్రతిభా పాటిల్ లోక్ సభ సభ్యురాలిగా ఉన్నారు. మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1991 నుంచి1996 వరకు అమరావతి లోక్ సభ స్థానం నుంచి ఎంపిగా పని చేశారు. అనంతరం ఆమె రాజస్థాన్ గవర్నర్ గా పని చేశారు. 2004 నుంచి 2007 వరకు రాజస్థాన్ కి 17వ గవర్నర్ గా పని చేశారు. అలానే రాజస్థాన్ కి తొలి మహిళా గవర్నర్ గా ఆమె చరిత్రలో నిలిచారు. అనంతరం 2007 నుంచి 2012 వరకు భారత దేశ రాష్ట్రపతిగా పని చేశారు. ఆమె భారత దేశానికి 12వ రాష్ట్రపతిగా పని చేశారు. అప్పడు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. అలానే ఎన్డీఏ బైరోన్ సింగ్ షెకావత్ ను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. చివరకు షెకావత్ పై ప్రతిభా పాటిల్ విజయం సాధించారు.

ఇక ఆమె రాజకీయ జీవితం విషయానికి వస్తే.. 27 సంవత్సరాల వయస్సులో  ప్రతిభా పాటిల్ జల్గావ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం  ఆమె 1967- 1985 మధ్య వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా  గెలిచారు.  ఆమె కొంతకాలం రాజ్యసభలో పార్లమెంటు సభ్యురాలిగా కూడా పని చేశారు. 1991లో 10 వ లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో  ప్రతిభా పాటిల్ అమరావతి నియోజకవర్గం నుండి లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఆమె అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి