iDreamPost

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే హ‌త్య‌, చైనీస్ సంబరాలు..

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే హ‌త్య‌, చైనీస్ సంబరాలు..

ప్రపంచ మంతా మాజీ జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే దారుణ హ‌త్య ప‌ట్ల దిగ్భ్రాంతితో ఉండ‌గా, చైనాలో కొందరు సంబ‌రాలు చేసుకొంటున్నారు. హంత‌కుడ్ని హీరోగా పిలుస్తున్నారు.


జ‌పాన్ లో అబేపై కాల్ప‌లు జ‌రిగిన సంగ‌తి తెలియ‌గానే, అత‌ను చ‌నిపోతే బాగుండున‌ని చాలా మంది కోరుకున్నారు. ఆయ‌న చ‌నిపోయార‌ని జ‌పాన్ ప్ర‌క‌టించ‌గానే, కొంద‌రు సోష‌ల్ మీడియాలో సెల‌బ్రేట్ చేసుకున్నారు. చైనాకు వ్య‌తిరేకంగా కూట‌మి క‌ట్టిన ఆయ‌నంటే, చాలామంది చైనా జాతీయుల‌కు మంట. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పైనా చైనాను విమ‌ర్శించారు. వాళ్ల విస్త‌ర‌ణ‌కాంక్ష‌ను నిర‌సించారు. ఆయనకు 67 ఏళ్లు

ఆయ‌న భార‌త‌దేశానికి మిత్రుడు. ప్ర‌ధాని మోదీతో మంచి స్నేహ‌సంబంధాలున్నాయి. ఆయ‌న‌ క్వాడ్ కూట‌మిని తీర్చిదిద్దారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ విధానాన్ని ప్ర‌చారం చేశారు.

తుపాకీ గుండు గుండెలోకి చొచ్చుకుపోయింది. ర‌క్తస్రావం ఆగ‌క‌పోవ‌డంతో ఆయ‌న చ‌నిపోయార‌ని వైద్యులు చెప్పారు. రెండుసార్లు కాల్పులు జ‌ర‌గ‌డంతో ఆయ‌నను ర‌క్షించ‌లేక‌పోయామ‌ని ఆయనకు చికిత్స చేసిన హాస్ప‌ట‌ల్ ధ్రువీకరించింది.

మాజీ ప్రధాని షింజో అబే నారాలో కాల్పుల‌కు బ‌లైయ్యార‌ని తెలియ‌గానే ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు.

షూటర్‌గా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని 41 ఏళ్ల టెత్సుయా యమగామిగా స్థానిక మీడియా చెబుతోంది. అతని ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా దొరికాయి. అతను వెనుక నుండి కాల్పులు జ‌రిపాడ‌ని, షాట్‌గన్ వాడిఉండొచ్చ‌న్న‌ది మీడియా క‌థ‌నాలు.

ఆదివారం జ‌ర‌గ‌బోయే ఎగువ సభ ఎన్నికలకు ముందు నాటి కార్యక్రమంలో, షింజో అబే ప్రసంగిస్తుండగా వెనుక నుండి ఒక షూట‌ర్ వ‌చ్చాడు. రెండుసార్లు కాల్చాడ‌ని ప్ర‌త్య‌క్ష‌సాక్షులు చెప్పారు. మొదటి బుల్లెట్ త‌గిలినా అబే కింద‌ప‌డ‌లేదు. రెండోసారి కాల్చిన‌ప్పుడు ఆయ‌న కుప్ప‌కూలిపోయాడు. అత‌ని సిబ్బందివెంట‌నే ఆయ‌న‌కు కార్డియాక్ మసాజ్ చేసారు.

ఆయ‌న కుప్పకూలిపోయిన‌ప్పుడు మెడ నుండి రక్తం కారుతోంది. ఆయ‌న‌కు వెంట‌నే ర‌క్తాన్ని ఎక్కించారు.

త‌ర‌చుగా ప్ర‌ధానులు మారే జ‌పాన్ లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే. 2006లో యేడాది పాటు ఆ త‌ర్వాత, 2012 నుండి 2020 వరకు ఆయ‌నే ప్ర‌ధానిగా ఉన్నారు. ఆనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

జపాన్ లో అత్యంత కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలు ఉన్నాయి. అక్క‌డ తుపాకీ లైసెస్స్ పొంద‌డ‌టం అంత‌సులువుకాదు. అక్ర‌మంగా తుపాకులుంటే క‌ఠినంగా శిక్షిస్తారు. తుపాకీ లైసెన్స్ సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ముందు మొదట షూటింగ్ అసోసియేషన్ నుండి సిఫార్సును పొందాలి, ఆపై పోలీసు తనిఖీలు చేస్తారు. ఆ త‌ర్వాతే గ‌న్ లైసెన్స్. మ‌రి హంత‌కుడి ద‌గ్గ‌ర తుపాకీ ఎలా వ‌చ్చింది? పోలీసులు విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి