iDreamPost

ఫ్లిప్ కార్ట్ యూజర్లకు గుడ్ న్యూస్.. 30 సెకన్లలో 5 లక్షల వరకు లోన్!

ఫ్లిప్ కార్ట్ యూజర్లకు గుడ్ న్యూస్.. 30 సెకన్లలో 5 లక్షల వరకు లోన్!

ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ బిజినెస్ లో ఫ్లిప్ కార్ట్ కు ఎంతో పేరుంది. ఇప్పటివరకు ఫ్లిప్ కార్టులో మీరు వస్తువులు మాత్రమే కొన్నారు. తర్వాత క్రెడిట్ కార్డు అప్లై చేేసే వీలు కల్పించారు. ఇకపై మీరు ఫ్లిప్ కార్టులో పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. అది కూడా ఏకంగా రూ.5 లక్షల వరకు లోన్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కేవలం 30 సెక్లలోనే మీరు ఈ లోన్ తీసుకోవచ్చు.

ఫ్లిప్ కార్టు సంస్థ యాక్సిస్ బ్యాంక్ కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీళ్లు సంయక్తంగా క్రెడిట్ కార్డుని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా పర్సనల్ లోన్ కూడా ప్రారంభించారు. యాక్సిస్ బ్యాంకు పర్సనల్ లోన్స్ ఇకనుంచి ఫ్లిప్ కార్టు ద్వారా కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ లోన్ టెన్యూర్ గరిష్టంగా 36 నెలలు ఉంటుంది. లోన్ అమౌంట్ అత్యధికంగా రూ.5 లక్షల వరకు అందిస్తారు. ఈ లోన్ ని మీరు కేవలం 30 సెక్లలోనే పొందవచ్చని ప్రకటించారు. ఇందుకోసం కస్టమర్ పాన్, డేట్ ఆఫ్ బర్త్, ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ వివరాలు మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంత వరకు లోన్ లభిస్తుంది అనే వివరాలను వెల్లడిస్తారు. మీరు 6 నెలల నుంచి 36 నెలల వరకు ఈ లోన్ ని ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ బౌ నవ్- పే లెటర్, ఈఎంఐ వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వైపు అన్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ విషయాల్లో ఆందోళన వ్యక్తం చేస్తోంటే.. ఫ్లిప్ కార్ట్, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు కొత్తగా లోన్స్ కావాలని ఎదురుచూస్తున్న వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స అనే చెప్పచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి