iDreamPost

దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్లు

దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్లు

సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 ఉద్యోగం

గాల్వన్ లోయలో చైనా సైనికులు చేసిన దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశం కోసం వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా ఉండాలని కేసీఆర్ అన్నారు.

గాల్వన్ లోయలో చైనా సైనికులు అమానుషంగా భారత సైనికులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. దాడిలో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. కాగా వీరమరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్ల ఆర్థిక సాయంతో పాటు సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగంతో పాటు నివాస స్థలం కూడా ఇవ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ఘర్షణలో వీర మరణం పొందిన మిగిలిన 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్ర రక్షణ మంత్రి ద్వారా ఈ సాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సైనికుల కుటుంబాలకు సహాయాన్ని అందించాలని కేసీఆర్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి