iDreamPost

అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. తొలిరోజు ఎంతమంది అంటే!

Ayodhya Ram Mandir: ఎంతో అట్టహాసంగా రామయ్య తన జన్మస్థానమైన అయోధ్యలో కొలువుతీరాడు. చాలా అంగరంగ వైభవంగా ఆ బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. ఇక తొలిరోజు సామాన్య భక్తులు అయోధ్యకు పోటెత్తారు.

Ayodhya Ram Mandir: ఎంతో అట్టహాసంగా రామయ్య తన జన్మస్థానమైన అయోధ్యలో కొలువుతీరాడు. చాలా అంగరంగ వైభవంగా ఆ బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. ఇక తొలిరోజు సామాన్య భక్తులు అయోధ్యకు పోటెత్తారు.

అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. తొలిరోజు ఎంతమంది అంటే!

ఎన్నో శతాబ్దాలుగా, కోట్లాది మంది హిందువులు కన్న కల సోమవారం నిరవేరింది. అయోధ్య నగరంలోకి రామయ్య అడుగు పెట్టారు. త్రేతాయుగంలో 14 ఏళ్ల మాత్రమే వనవాసం చేసిన ఆ శ్రీరామచంద్రుడు కలియుగంలో మాత్రం కొన్నివందల ఏళ్లు బయటనే గడిపారు. ఎంతో మంది పోరాటల కృషి ఫలితంగా జనవరి 22న తన ఇంటికి రామయ్య చేరుకున్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. సోమవారం ఎంతో అంగరంగ వైభవంగా రామ మందిర ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ వేడుకను చూసేందుకు వేలాది మంది అతిథులు, లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు వెళ్లారు. ఇక నేటి నుంచి భక్తులకు అయోధ్య రాముని దర్శనం ప్రారంభమైంది. తొలి రోజు అయోధ్యకు భక్తులు పోటెత్తారు. తొలిరోజు ఎంత మంది భక్తులు వచ్చారో ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

జనవరి 22న అయోధ్య నగరమంతా కాషాయంతో నిండిపోయింది. అలానే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రామనామ స్మరణలు మారుమోగిపోయాయి. కొన్ని శతాబ్దాలు కోట్లాది మంది హిందువుల గుండెల్లో నింపుకున్న బాధ, ఆవేదన, కోరిక నిన్నటితో తీరిపోయింది. రామ మందిర ప్రారంభోత్సవంతో ఎన్నో ఏళ పోరాటనికి ఫలితం దక్కినట్లు అయింది. సోమవారం ఘనంగా రామమందిరం ప్రారంభోత్సవం జరగ్గా మంగళవారం నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఇక సామాన్య భక్తలకు రామయ్య దర్శనానికి అనుమతి లభించడంతో లక్షల మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. మంగళవారం తెల్లవారు జామున  3 గంటల నుంచే ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.  అయోధ్యలోని ప్రధాన మార్గమైన రామ్ ఫథ వీధులన్నీ రామభక్తులతో నిండిపోయాయి. తొలిరోజు మధ్యాహ్నానికి 2.5 నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. అంతేకాక అదే స్థాయిలో  రామాలయం బయట కూడ భక్తలు వేచి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  అయోధ్య రాముని దర్శనం కోసం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను కాంప్లెక్సులోకి అనుమతించారు. ఇలా కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకే దాదాపు 2.5నుంచి 3 లక్షల మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ అంచనా వేశారు. మొత్తంగా తొలిరోజు అయోధ్య రామయ్యను 5 లక్షల మంది దర్శంచుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక రామయ్య దర్శన విషయంలో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక భక్తులను ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, అలానే మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు దఫాలుగా అనుమతిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో వారిని నియంత్రిచడం పోలీసులకు సవాలుగా మారింది. ఆలయ ప్రధాన గేటు వద్ద జనం కిక్కిరిసిపోవడంతో మధ్యాహ్నం ఆలయం తిరిగి తెరవడానికి అధికారులు, ఆలయ సిబ్బంది  ఇబ్బంది పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 8 వేల మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే జనవరి 23వ తేదీ నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తామని ఆయోధ్య ట్రస్ట్ ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాణప్రతిష్ట జరిగిన రాత్రి నుంచి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.అలానే  అనేక మంది కాలినడకన అయోధ్య రాముని దర్శానికి వెళ్తున్నట్లు సమాచారం. మొత్తంగా తొలిరోజు అయోధ్య రాముడ్ని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి