iDreamPost

ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్‌ సాధించిన సినిమాలు.. సలార్‌ ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..

First Day Highest Grossing Movies: సలార్‌ సినిమా మొదటి రోజు ఏకంగా 160 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సమాచారం. మరి, ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో.. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏవి. టాప్‌ టెన్‌లో సలార్‌ స్థానం ఏంటి?

First Day Highest Grossing Movies: సలార్‌ సినిమా మొదటి రోజు ఏకంగా 160 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సమాచారం. మరి, ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో.. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏవి. టాప్‌ టెన్‌లో సలార్‌ స్థానం ఏంటి?

ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్‌ సాధించిన సినిమాలు.. సలార్‌ ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..

ఒకప్పుడు హీరో సత్తాను.. సినిమా సత్తాను.. ఆ సినిమా ఆడే రోజుల్లో లెక్క గట్టే వారు. ఎన్ని రోజులు ఆడితే అంత పెద్ద హిట్‌ అయినట్లు. రెండు సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. వసూళ్లే అన్నిటినీ నిర్థేశిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి రోజు కలెక్షన్లే హీరో స్టామినాను, సినిమా స్టామినాను చెప్పే కొలమానంగా మారిపోయాయి. ప్యాన్‌ ఇండియా సినిమాలు రాకముందుకు వరకు ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయంలో బాలీవుడ్‌ టాప్‌లో ఉండేది.

బహుబలి తర్వాత బొమ్మ తిరిగిపడింది. ఆ స్థానాన్ని ప్యాన్‌ ఇండియా సినిమాలు ఆక్రమించాయి. రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాయి. కలెక్షన్ల విషయంలో దేశ వ్యాప్తంగా సౌత్‌ సినిమాలే టాప్‌లో ఉంటున్నాయి. మరి, ఫస్ట్‌ డే కలెక్షన్ల పరంగా టాప్‌ టెన్‌లో ఏఏ చిత్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ స్థానం ఏంటి? శుక్రవాం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌ మూవీ సలార్‌ ఎన్నో స్థానంలో ఉంది? సౌత్‌ సినిమాలు ఎన్ని టాప్‌ టెన్‌లో ఉన్నాయి?…

1st day collections

ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్‌ సాధించిన సినిమాలు..

  1. ఆర్‌ఆర్‌ఆర్‌ : రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ 2022, మార్చి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల అయింది. మొదటి రోజు దాదాపు 223.5 కోట్ల వసూళ్లు సాధించింది.
  2. బాహుబలి 2 : రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2017, ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మొదటి రోజు దాదాపు 214.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.
  3. సలార్‌ : ప్రశాంత్‌ నీల్‌- ప్రభాస్‌ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2023, డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు 178.7 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.
  4. లియో : తమిళ స్టార్‌ విజయ్‌ – లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2023, అక్టోబర్‌ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 145 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
  5. ఆదిపురుష్‌ : ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2023, జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మొదటి రోజు 136.8 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
  6. సాహో : ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ 2019 ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 130 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.
  7. జవాన్‌ : షారుఖ్‌ -అట్లీ కాంబోలో వచ్చిన ఈ మూవీ 2023, సెప్టెంబర్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మొదటి రోజు 129 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
  8. కేజీఎఫ్‌ 2 : ప్రశాంత్‌ నీల్‌ – యశ్‌ కాంబోలో వచ్చిన ఈ మూవీ 2022, ఏప్రిల్‌ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 120 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
  9. పఠాన్‌ : బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2023, జనవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మొదటి రోజు ఏకంగా.. 106 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
  10. రోబో 2.0 : రజినీకాంత్‌- శంకర్‌ కాంబోలో వచ్చిన ఈ మూవీ 2018, నవంబర్‌ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. మొదటి రోజు దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.

ఈ లిస్టులో సలార్‌ మూడవ స్థానంలో నిలిచింది. మరి, ఈ లిస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి