iDreamPost

భారీ పేలుడు.. ఇద్దరు మృతి. 300 మందికి తీవ్ర గాయాలు!

Gas Explosion in Nairobi: ఇటీవల పలు చోట్ల కెమికల్ ఫ్యాక్టీరీలు, గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీల్లో గ్యాస్ లీకై భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే మరొకటి జరిగింది.

Gas Explosion in Nairobi: ఇటీవల పలు చోట్ల కెమికల్ ఫ్యాక్టీరీలు, గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీల్లో గ్యాస్ లీకై భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే మరొకటి జరిగింది.

భారీ పేలుడు.. ఇద్దరు మృతి. 300 మందికి తీవ్ర గాయాలు!

మనిషికి ప్రమాదాలు ఎటువైపు నుంచి పొంచి ఉంటాయో ఎవరూ ఊహించలేరు. ఇటీవల అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్, రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్ ఇలా ఎన్నో కారణాల వల్ల చనిపోతున్నారు. సాధారణంగా కెమికల్ ఫ్యాక్టీరీలు, గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీ, బాణా‌సంచా ఫ్యాక్టీరీలు, గోదాములు, వస్త్ర సముదాయాలు, ప్లాస్టీక్ కంపెనీల్లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ఉండాలని అధికారులు చెబుతుంటారు. కానీ కొంతమంది నిబంధనలు పాటించక ప్రమాదం జరిగినపుడు ఆందోళన చెందుతారు.. దాని ఫలితంగా ఎంతోమంది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. కోట్లలో ఆస్తి నష్టం జరుగుతుంది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన నైరోబీలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

కెన్యా రాజధాని నైరోబిలో గురువారం అర్థరాత్రి సమయంలో భారీ పేలుడు సంభవించడంతో తీవ్ర కలకలం రేపింది. ఇక్కడ ఓ గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి..దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో స్పాట్ లోనే ఇద్దరు కన్నుమూశారు.. దాదాపు 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి రెడ్ క్రాస్ సిబ్బంది సైతం వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను అక్కడ నుంచి దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వ ప్రతినిధి ఇస్సాక్ మైగువా ఆదేశించారు.

చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి కంపెనీలో ఉన్న రెండు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. అక్కడ ఉన్న వాహనాలు, వ్యాపార సముదాయాలు, కొన్ని ఇళ్లు కాలి బూడిదయ్యాయి. మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది అధికారి తెలిపారు. ఒక్కసారిగా పెలుళ్ల శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. అక్కడ దట్టంగా వ్యాపించిన పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అక్కడ పరిస్థితులపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి