iDreamPost

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు.. 9 మంది దుర్మరణం!

ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలకు కారణం ఏదైనప్పటీకీ ఎంతో మంది అమాయకలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ కంపెనీల ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలకు కారణం ఏదైనప్పటీకీ ఎంతో మంది అమాయకలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ కంపెనీల ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు.. 9 మంది దుర్మరణం!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు, ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు సజీవ దహనం  అవుతున్నారు. అంతేకాక భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇటీవలే హైదరాబాద్ లోని నాంపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ బాంబుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో ఓ కర్మాగారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగ్ పూర్ లోని బజార్ గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ ను ప్యాక్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అదే సమయంలో అక్కడేఉన్న 9 మంది మరణించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

నాగ్ పూర్ కలెక్ట్ డాక్టర్ విపిన్ ఇట్నాకర్ , గ్రామీణ ఎస్పీ హర్ష్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ ఘటన స్థలంలో సహయ చర్యలు చేపట్టారు. చాలా మందికి తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. వారందరని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఘటన ఎలా జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్లూ టీమ్స్ ఘటన స్థలాన్ని పరిశీలిస్తుంది. గతంలోనూ ఇలా బాంబుల తయారీ కంపెనీల్లో పేలుడులు సంభవించాయి. అలాంటి ఘటనల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో కాలు, చేతులు కోల్పోయి బతికున్న జీవచ్చావల్లా బతికారు.

కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని సికింద్రబాద్ ప్రాంతంలో జరిగిన వివిధ ఘటనల్లో  పలువురు యువకులు మృతి చెందారు. ఓ లాడ్జీలో జరిగిన ప్రమాదంలో కొందరు మరణించారు. ఇలా అగ్నిప్రమాదాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటనకు గల కారణాలపై పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు  ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మరి.. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి