iDreamPost

Financial tips ఈ ఐదు ఉచ్చుల్లో పడ్డారా మీ డబ్బు గోవిందా!

Financial tips ఈ ఐదు ఉచ్చుల్లో పడ్డారా మీ డబ్బు గోవిందా!

మీరు చెమటోడ్చి సంపాదించిన డబ్బు సరైన మదుపు మార్గాల్లో పెట్టకపోతే ఎందుకూ పనికి రాకుండా పోతుంది. అందుకే డబ్బును invest చేసే ముందు ఆయా మార్గాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దీనికి తోడు మీ డబ్బు గుంజడానికి పొంచి ఉన్న ఉచ్చులను కూడా గమనించుకుంటూ పోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.

 1. అవసరాలు వర్సెస్ కోరికలు (Needs Vs Wants)
మీరు బడ్జెట్ రూపొందించుకున్నప్పుడు అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలి. మనం బతకడానికి కావల్సిన ప్రాథమిక వస్తువులను అవసరాలు అని చెప్పుకోవచ్చు. కోరికలు అంత అవసరమైనవి కాకపోవచ్చు. కానీ అవి మీ జీవన ప్రమాణాన్ని పెంచుతాయి. ముందుగా అవసరాలకు కావల్సిన డబ్బును పక్కన పెట్టుకున్నాకే కోరికల సంగతి చూడాలి. కెరీర్ తొలి దశలో అయితే కోరికలకు పరిమిత బడ్జెట్ కేటాయించి మిగిలిన దాన్ని మదుపులో పెడితే మంచిది. ఫ్యామిలీ పెరిగే కొద్దీ కోరికలకు కావల్సిన బడ్జెట్ ను జాగ్రత్తగా పెంచుతూ పోవచ్చు.

2. యాంకరింగ్ (Anchoring)
ఒక స్టాక్ కి గతంలో ఉన్న విలువను బట్టి దాని భవిష్యత్ విలువను అంచనా వేస్తుంటాం. దీన్నే anchoring అంటారు. ఎప్పుడో రేటు పెరిగింది కదా ఇక ముందు కూడా అలాగే పెరుగుతుందని ఎక్కువ రేటున్న షేర్లు కొనేస్తుంటాం. కానీ ఇలాంటి అంచనాలు ఎప్పటికైనా ప్రమాదకరమే! వీటికి దూరంగా ఉంటే మంచిది.

3. క్రెడిట్ కార్డులు (Credit Cards)
క్రెడిట్ కార్డులను అతి పెద్ద గాలంగా చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే క్రెడిట్ కార్డుంటే చాలా ఆర్థికపరమైన అంశాలను మేనేజ్ చేసుకోవచ్చు. ఫలితంగా మనకు ఎన్నో ఫ్రీ రివార్డులు దొరుకుతుంటాయి. కానీ క్రెడిట్ కార్డు చేతిలో ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టేస్తుంటాం. ఆఫర్ ఉంటే అవసరం లేని వస్తువులు కూడా కొనేస్తుంటాం. చివరికి మోపెడు బిల్లులు కట్టలేక చతికిలబడతాం. క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లు 20-40 శాతం ఉంటాయి. వీటిని ప్రతి నెలా కట్టడం తలకు మించిన భారంగా మారుతుంది. అందుకే క్రెడిట్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

4. ఇన్సూరెన్స్ లో మదుపు వద్దు
మనకు గానీ మన కుటుంబానికి గానీ ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కాపాడుతుంది. కానీ ఇన్సూరెన్స్ నుంచి మంచి రిటర్న్స్ రావాలనుకోవడం కరెక్ట్ కాదు. దాని మానాన దాన్ని వదిలేసి వేరే మార్గాల్లో invest చేసుకోవడం ఉత్తమం.

5. నగలల్లోనూ మదుపు వద్దు
నగలు వేసుకోవడానికి బావుంటాయి. వాటిలో మదుపు చేయడం వల్ల రిటర్న్స్ పెద్దగా రావు. అందుకే ఆభరణాల బదులు ప్లెయిన్ గోల్డ్ లో కానీ పేపర్ గోల్డ్ లో కానీ మదుపు చేస్తే మేలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి