iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి

  • Published Dec 27, 2023 | 11:35 AMUpdated Dec 27, 2023 | 11:35 AM

ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చోటు చేసుకుంటున్నాయి. తమ అభిమాన నటీనటులు ఇతర కంగాల్లో పనిచేసేవారు కన్నుమూయడంతో అభిమానులు దుఖఃంలో మునిగిపోతున్నారు.

ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చోటు చేసుకుంటున్నాయి. తమ అభిమాన నటీనటులు ఇతర కంగాల్లో పనిచేసేవారు కన్నుమూయడంతో అభిమానులు దుఖఃంలో మునిగిపోతున్నారు.

  • Published Dec 27, 2023 | 11:35 AMUpdated Dec 27, 2023 | 11:35 AM
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు, వారిని ఎంతగానో అభిమానిస్తున్న అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. ఈ మద్య చాలా వరకు హార్ట్ ఎటాక్ తో నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్లు, డ్యాన్స్, ఫైట్ మాస్టర్స్ కన్నుమూస్తున్నారు. గత వారం సినీ పరిశ్రమలో వెంట వెంటనే విషాదాలు జరిగాయి.. ప్రముఖ కమెడియన్స్ రాజు శ్రీ వాత్సవ, బోండ మణీ మరణించారు.. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ ఫైట్ మాస్టర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో యాక్షన్ చిత్రాలు అంటే ఎవరైనా ఇష్టపడతారు.. తెరపై విలన్స్ తో హీరో తలపడే సన్నివేశాలు ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆ ఫైట్ సీన్స్ వెనుక ఫైట్ మాస్టర్స్ ఎంతో కష్టపడుతుంటారు. కొన్ని సినిమాల యాక్షన్ సన్నివేశాలే ప్రాణం పోస్తుంటాయి. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఫైట్స్ సీన్లు తెరకెక్కించాలంటే.. ఎంతో శ్రమతో కూడుకున్న పని. అందుకే ఏ సినిమాలో అయినా ఫైట్ మాస్టర్స్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ జాలి బాస్టియన్ (57) డిసెంబర్ 26న కన్నుమూశారు. బెంగుళూరులోని తన నివాసంలో కార్డియాట్ అరెస్ట్ తో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిసెంబర్ 27 న అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 900 చిత్రాలకు ఆయన ఫైట్ మాస్టర్ గా పనిచేశారు.

famous action director passed away

జాలి బాస్టియన్ 24 సెప్టెంబరు 1966న అలెప్పీలో జన్మించారు. అల్లాపి కేరళకు చెందిన బాస్టియన్ బెంగళూరులో పెరిగాడు. మొదటి నుంచి సినిమాలపై ఎక్కువ మోజు పెంచుకున్న జాలి బాస్టియన్ ఫైట్ కొరియోగ్రఫీలో ఒక మెంబర్ గా కొనసాగారు. బైక్, కారు ఛేజింగ్ సీన్లలో లీడ్ కోసం డూప్ గా పనిచేశారు. తర్వాత తనే సొంతంగా ఫైట్ కొరియోగ్రఫర్ గా మారి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారు. బైక్స్, భారీ వాహనాలతో స్టంట్స్ చేయడం ఆయనకు కొట్టిన పిండి. 300 సినిమాలకు పైగా హై రిస్క్ బ్లాస్ట్ సీక్వెన్స్ చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జాలీ బాస్టియన్. తెలుగు లో అన్నయ్య, నక్షత్రం మూవీస్ కి స్టంట్ కొరియోగ్రాఫర్ గా చేశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి