iDreamPost

27 న రాజధాని పై తుది నిర్ణయం!!

27 న రాజధాని పై తుది నిర్ణయం!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని పై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుందని, ఆ రోజే మంత్రి వర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాజధాని పై జరుగుతున్న పరిణామాలపై మీడియాతో మాట్లాడిన బొత్స జీఎన్ రావు కమిటీ నివేదికపై స్పందించారు.

ఆ కమిటీ రాజధానిపై కొన్ని కీలక సూచనలు చేసిందని, ఈ నివేదిక లోని అన్ని అంశాల మీద ఈ నెల 27న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని జీఎన్ రావు నివేదిక సుచించిందని తెలిపారు. రాజధాని అంశం విషయంలో ప్రాంతీయ అసమానతలు రాకూడదనే జియన్ రావు కమిటీ వెశామని తెలిపారు

నిన్న అమరావతిలో రైతుల ఉధ్యమానికి సంఘీబావం తెలుపుతూ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు వల్ల అభివృద్ధి సాధించినట్లు కాదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన బొత్స మరి అలాంటప్పుడు నువ్వు ఇంతలా అందోళన చెందాల్సిన అవసరం ఎందుకని ఎద్దేవా చేశారు. రైతుల దగ్గర భూములు లాకొన్ని చంద్రబాబు తన బంధువులు అనుయాయులకు పందేరం చేశాడని బొత్స ఆరోపించారు.

ఇప్పటికైనా రాజధాని రైతులు తాము ఆందోళనలపై పునరాలోచించుకోవాలని సూచించారు. అమరావతి పేరుతో టీడీపీ దోపిడీకి పాల్పడిందని, అన్ని జిల్లాల అభివృద్దే ధ్యేయంగా తమ పార్టీ, ప్రభుత్వం ముందుకు సాగుతుందని బొత్స తెలిపారు. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రానికి 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిన చంద్రబాబు ఆమరావతి కి కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొడుటున్నారన్నారు

అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని,అసెంబ్లీ రాజ్ భవన్ ఇక్కడే కొనసాగుతాయన్నారు. రైతులకు హామీ ఇచ్చినట్లుగా వారి భూములను అభివృద్ధి చేసి ఇస్తామని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి