iDreamPost

కలికాలం.. చద్దన్నానికి అమెరికాలో డిమాండ్.. ఎంత రేట్ అంటే..?

పెద్దల మాట చద్దన్నం మూట అంటుంటారు పెద్దలు. అంటే సద్దన్నం ఎంత మంచిదో.. పెద్దోళ్ల మాటలు కూడా మన మంచికే అని ఈ సామెతను వాడుతుంటారు. ఇప్పటి పిల్లలకు ఈ చద్దన్నం గురించి తెలియకపోవచ్చు కానీ.. తాతలు, ముత్తాతల తరంలో ఇదే ఎక్కువగా తీసుకునేవారు. మళ్లీ ఇప్పుడు..

పెద్దల మాట చద్దన్నం మూట అంటుంటారు పెద్దలు. అంటే సద్దన్నం ఎంత మంచిదో.. పెద్దోళ్ల మాటలు కూడా మన మంచికే అని ఈ సామెతను వాడుతుంటారు. ఇప్పటి పిల్లలకు ఈ చద్దన్నం గురించి తెలియకపోవచ్చు కానీ.. తాతలు, ముత్తాతల తరంలో ఇదే ఎక్కువగా తీసుకునేవారు. మళ్లీ ఇప్పుడు..

కలికాలం.. చద్దన్నానికి అమెరికాలో డిమాండ్.. ఎంత రేట్ అంటే..?

ఇప్పుడు మానవుని జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కట్టుబొట్టు నుండి తినే తిండి వరకు మార్పులు చోటుచేసుకున్నాయి. పొద్దున్నే టీ, కాఫీలు ఆ తర్వాత టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ స్నాక్స్ అది కూడా ఆప్షనల్, రాత్రికి మళ్లీ భోజనం లేదంటే చపాతీలు, పుల్కాలు. ఇదొక రోటీన్ ఆహార వ్యవహారంగా మారిపోయింది. దీంతో ఆరోగ్య సమస్యలు రావడం మొదలయ్యాయి. ఆహార వ్యవహారాల్లో మార్పులు కారణంగా మనిషిలో సత్తువ, ఓపిక రాను రానూ తగ్గుకుంటూ వస్తుంది. కానీ ఒకప్పుడు తాతలు, ముత్తాతల తరంలో టిఫిన్స్ అనే పదం చాలా అరుదు. పొద్దునే కోడి కూయక ముందే నిద్ర లేచి.. రాత్రి 7 గంటలకే నిద్రపోయేవారు. ఎంతటి అలసట వచ్చినా.. మరుసటి రోజు పనుల కోసం పరుగులు పెట్టేవారు.

దానికి కారణం అప్పట్లో వారు తీసుకున్న ఆహారమే. ఆ తిండి తిని రాయిలా కష్టపడేవారు. గంటలు గంటలు పనిచేసేవారు. ఇంతకు ఆ ఆహారం ఏంటంటే.. చద్దన్నం. ఇప్పటి తరానికి తెలియని ఓ మంచి ఆహార పదార్థం. ఇప్పటి కాలానికి న్యూడుల్స్, బర్గర్స్, చికెన్ లాలీపాప్స్ వీలైతే.. ఇంత కన్నా మోడ్రన్ ఫుడ్ దొరికితే అది కూడా. ఇవి తిని.. కొంచెం పనికే అలిసిపోతున్నారు. అదేమని అడిగితే.. మీ కాలం నాటి తిండ్లు కాదమ్మా మావీ అంటూ రాగాలు తీస్తుంటారు. కానీ అప్పుడు కూడా గొప్ప తిండ్లేమీ కాదూ. కేవలం పొద్దున్నే టిఫిన్ రూపంలో.. రాత్రి పూట అన్నం పులియబెట్టి.. పొద్దున్నే తయారైన చద్దన్నాని తినేవారు. ఇప్పుడు పిల్లలకు ఈ ఆహారం పెడితే.. అస్సలు ముట్టనే ముట్టరు. అలాగే చల్లన్నం పెడతావా అంటూ రివర్స్ అవుతూ ఉంటారు.

Chaddanna is super crazy in America

కానీ కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఒక్కసారిగా తల్లకిందులు అయ్యాయి. దీంతో ప్రపంచం మొత్తం ఆహార వ్యవహారాల్లో ఛేంజస్ సంతరించుకున్నాయి. హెల్తీ ఫుడ్స్ వైపు దృష్టి సారించారు. అంతకముందు కూడా ఎన్నో ఇలాంటి ఫ్లూలు వచ్చినా ..నిలబడి తట్టుకుని ఉన్నారంటే.. ఫుడ్ హ్యాబిట్స్ అని గ్రహించి.. అప్పటి ఆహారం, వాటి విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. అలా మళ్లీ తిరిగి వచ్చిందే చద్దన్నం. చాలా మంది డాక్టర్స్ సైతం ఈ చద్దన్నంలో పోషక విలువలు ఉన్నాయని, ఆరోగ్యానికి మంచిందని చెప్పడంతో తిరిగి తింటున్నారు. ఒక్క ఇండియాలోనే కాదూ.. అమెరికా వంటి అగ్ర రాజ్యం కూడా ఈ ఆహారాన్ని తీసుకుంటుంది. అక్కడ ఈ ఫుడ్ ఆన్ లైన్లలో కూడా అమ్ముడు అవుతుంది. అక్కడ ఒక కుండలో రైస్ సుమారు 13 డాలర్లకు( వెయ్యి రూపాయలకు పై మాట) అమ్ముతున్న వీడియో నెట్టింట్లో వైరల్ కూడా అయ్యింది. దీని చూస్తే.. ఈ చద్దన్నానికి ఎంత డిమాండ్ పెరిగిందో అర్థమౌతుంది.

దీన్ని తయారు చేసుకోవడానికి పెద్దగా శ్రమ కూడా అవసరం లేదు. రాత్రి తినగా మిగిలిన అన్నాన్ని.. ఉండలు లేకుండా చిదుముకుని.. ఓ కుండలో వేసుకోవాలి. అన్నంలో కాస్త నీళ్లు పోసి.. అందులో గోరు వెచ్చని పాలు, కొంచెం పెరుగు, ఉల్లిపాయ, మిర్చి, ఉప్పు కూడా వేసుకొని.. రాత్రంతా పులియబెట్టాలి. పొద్దున్నే కరివేపాకుతో తాళింపు వేసుకుని కాస్తంత అల్లం, కొత్తిమీర జోడించి తిన్నా.. లేదా అలాగే ఆరగించినా మంచి ఫలితాలు ఉంటాయి. పొద్దున్నే టిఫిన్ స్థానంలో ఇది తింటే కడుపు నిండటంతో పాటు శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. పెరుగు పులియడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ప్రొ బాక్టీరియా వృద్ధి చెందుతోంది. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. అలాగే అల్సర్, పేగు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రక్త హీనత ఉండదు. మరీ ఇన్ని లాభాలున్న చద్దన్నం మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bigg boss telugu spy, Spy Akka (@biggbossteluguspy)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి