iDreamPost
android-app
ios-app

అర్జున్ వర్సెస్ విశ్వక్ సేన్.. ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్..

అర్జున్ వర్సెస్ విశ్వక్ సేన్.. ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్..

టాలీవుడ్ లో వరుస హిట్స్ కొడుతూ మాస్, క్లాస్ సినిమాలు తీస్తూ ఇటీవలే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి విజయం సాధించిన విశ్వక్ సేన్ హీరోగా ఆ మధ్యన అర్జున్ తన కొత్త సినిమాని అన్నౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా ఆగిపోయి.. ఫిల్మ్ ఛాంబర్ కంప్లైంట్స్ దాకా వెళ్లిందని వినికిడి.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen), యాక్ష‌న్ కింగ్‌ అర్జున్ (సార్జా) (Arjun Sarja) డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. విశ్వ‌క్ సేన్ 11వ (Vishwak Sen) ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రంలో అర్జున్ కూతురు ఐశ్వ‌ర్యా అర్జున్ (Aishwarya Arjun) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఈ చిత్రాన్ని హోంబ్యాన‌ర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌పై తెర‌కెక్కిస్తున్నాడు అర్జున్. ఈ చిత్రానికి అర్జున్ స్వ‌యంగా క‌థ‌నందించ‌డం విశేషం. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

EXCLUSIVE: Vishwak Sen confirms his next with Arjun Sarja; To launch his daughter in the film? | PINKVILLA

ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో చేయనని విశ్వక్ సేన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అర్జున్.. ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేయబోతున్నారని సమాచారం. అసలు గొడవేం జరిగింది. ఈ ఇష్యూ ఎలా సెటిల్ కానుందో వేచి చూడాలి.

Vishwak Sen vs Arjun Sarja: అర్జున్ వర్సెస్ విశ్వక్ సేన్.. ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైట్ ఇస్తానంటున్న యాక్షన్ కింగ్ | TV9 Telugu

అశోకవనంలో అర్జుణ క‌ళ్యాణం సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు విశ్వ‌క్ సేన్‌. అయితే రీసెంట్ గా రిలీజైన ‘ఓరి దేవుడా’ చిత్రం మాత్రం వర్కవుట్ కాలేదు. వెంకటేష్ ఉన్నా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ నేపధ్యంలో ఇలాంటి వివాదాలు అతని కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి..అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ ల‌వ‌ర్స్.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibom