iDreamPost

హద్దులు దాటిన అభిమానం! బూ*తుల ట్రెండ్ ఏ హీరో మెచ్చుతాడు?

Vijayendra Prasad: టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వికృత ట్రెండ్ నడుస్తోంది. అది మితిమీరడం మాత్రమే కాకుండా.. మరీ హద్దులు దాటిపోతోంది.

Vijayendra Prasad: టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వికృత ట్రెండ్ నడుస్తోంది. అది మితిమీరడం మాత్రమే కాకుండా.. మరీ హద్దులు దాటిపోతోంది.

హద్దులు దాటిన అభిమానం! బూ*తుల ట్రెండ్ ఏ హీరో మెచ్చుతాడు?

టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా.. ఆఖరికి హాలీవుడ్ అయినా సినిమా రిజల్ట్ అనేది అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఏ వుడ్ లోనైనా హీరోలుగా, స్టార్ హీరోలుగా ఎదగాలంటే ఫ్యాన్స్ సపోర్ట్ అయితే ఉండాల్సిందే. ఒక హీరో నటన, డ్యాన్స్, హావభావాలు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ లో అభిమానించడం ప్రారంరభిస్తే అది ఎంత దూరమైనా వెళ్తారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త హద్దులు దాటుతున్నట్లు కనిపిస్తోంది. సినిమా అంటే కేవలం హీరో మాత్రమే అనే భ్రమల్లోకి అభిమానులు వెళ్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభిమానం ముసుగులో ఎల్లలు దాటి ప్రవర్తిస్తున్న తీరు ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తోంది.

సినిమా అంటే కేవలం హీరో మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ, ఒక సినిమా సూపర్ డూపర్ హిట్టు కొట్టాలి అంటే దాని కోసం 24 క్రాఫ్ట్స్ వాళ్లు పని చేయాలి. వెండితెర మీద కనిపించేది హీరోనే అయినా.. ఆ హీరోని అంత బాగా చూపించేందుకు ఎంతోమంది క్రియేటివ్ పీపుల్ కష్టపడాల్సి ఉంటుంది. కానీ, అవేమీ పట్టించుకోకుండా సినిమా హిట్ అయితే హీరోని పొగడటం, అటూ ఇటూ అయితే డైరెక్టర్ ని తిట్టడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు ఈ ట్రెండ్ మరీ బూ*తులు తిట్టే స్థాయికి దిగజారిపోయింది. విషయం ఏంటంటే.. ఇటీవల స్టార్ రైటర్ విజయంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆయనకు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఒక ప్రశ్న ఎదురైంది.

జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి విజయేంద్ర ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తానికి తారక్ చేసిన కొమురం భీమ్ పాత్ర సపోర్ట్ అని చెప్పారు. అంటే తారక్ పాత్ర కథను నడిపించేది అంటూ చెప్పారు. అంతేకాకుండా అమాయకత్వంతో కూడిన కొమురం భీమ్ రోల్ ని తారక్ తప్పితే మరెవరో చేయలేరు అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ మొత్తం ఇంటర్వ్యూలో తారక్ గురించి ఆయన చెప్పిన గొప్ప విషయాలను గాలికి వదిలేసి.. మా హీరో పాత్రను సపోర్టింగ్ రోల్ అంటావా అంటూ తిట్ల దండకం అందుకుంటున్నారు. ఆయన ఎక్కడా తారక్ సపోర్టింగ్ రోల్ అనలేదు.. సినిమాకి అతని క్యారెక్టర్ సపోర్ట్ అని చెప్పారు. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఇష్టారీతిన నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల గుంటూరు కారం సినిమా టైమ్ లో కూడా ఇలాంటి ప్రవర్తనే చూశాం. మేకర్స్ ని ఇష్టమొచ్చినట్లు నెట్టింట కామెంట్స్ చేశారు. సినిమా అంటే హీరో మాత్రమే కాదు.. దాని వెనుక ఎంతో గొప్ప క్రియేటివ్ పీపుల్ ఉంటారనే విషయాన్ని మర్చిపోతున్నారు. నిజానికి ఇలాంటి ఒక ట్రెండ్ ని ఏ హీరో కూడా మెచ్చుకోడు. దీనిని దిగజారిన అభిమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా అభిమానం ముసుగులో ఇలాంటి ట్రెండులను మానుకుంటే అటు సినిమాలకే కాకుండా.. ఇటు ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. ఫ్యాన్స్ పేరిట చేస్తున్న వికృత చేష్టలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి