iDreamPost

Rohit Sharma: రోహిత్ శర్మకు తలొంచిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!

తాజాగా రోహిత్ శర్మ దెబ్బకు ఏకంగా ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తలొంచింది. తన మాటల వాగ్ధాటితో విమర్శలకు ధీటైన కౌంటర్స్ ఇవ్వడమే కాకుండా సరైన పాయింట్ రేజ్ చేసి.. శభాష్ అనిపించుకుంటున్నాడు హిట్ మ్యాన్.

తాజాగా రోహిత్ శర్మ దెబ్బకు ఏకంగా ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తలొంచింది. తన మాటల వాగ్ధాటితో విమర్శలకు ధీటైన కౌంటర్స్ ఇవ్వడమే కాకుండా సరైన పాయింట్ రేజ్ చేసి.. శభాష్ అనిపించుకుంటున్నాడు హిట్ మ్యాన్.

Rohit Sharma: రోహిత్ శర్మకు తలొంచిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!

ప్రపంచ క్రికెట్ లో టీమిండియాకు ప్రత్యేక గౌరవంతో పాటుగా, గుర్తింపూ ఉంది. అదీకాక వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ గా బీసీసీఐకు పేరు ఉండనే ఉంది. దీంతో ప్రపంచ క్రికెట్ ను భారతదేశం శాసిస్తోందని గత కొంతకాలంగా వివిధ దేశాలు తమ అక్కసును వెళ్లగక్కుతూ వస్తున్నాయి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా రోహిత్ శర్మ దెబ్బకు ఏకంగా ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తలొంచింది. తన మాటల వాగ్ధాటితో విమర్శలకు ధీటైన కౌంటర్స్ ఇవ్వడమే కాకుండా సరైన పాయింట్ రేజ్ చేసి.. శభాష్ అనిపించుకుంటున్నాడు హిట్ మ్యాన్. ఇంతకీ రోహిత్ చేసిన పనేంటి? ఐసీసీ తలొంచి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి.. సిరీస్ ను సమం చేసుకున్నాయి. అయితే కేప్ టౌన్ వేదికగా న్యూలాండ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ లో దారుణమైన స్కోర్లు నమోదు అయ్యాయి. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 55 పరుగులకే కుప్పకూలడం, ఆ తర్వాత ఇండియా సైతం 153 రన్స్ కే ఆలౌట్ కావడంతో పిచ్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం న్యూలాండ్స్ పిచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కేప్ టౌన్ పిచ్ పై అసంతృప్తిని వెళ్లగక్కాడు.

“భారత స్పిన్ పిచ్ ల గురించి మాట్లాడే ‘SENA’ దేశాల ఆటగాళ్లు.. సఫారీ పేస్ పిచ్ ల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ మ్యాచ్ జరిగిన తీరు అందరూ చూశారు. బౌన్సీ పిచ్ పై బ్యాటింగ్ చేయడానికి ప్లేయర్లందరూ నానా తంటాలు పడ్డారు. ఇకపై భారత పిచ్ ల గురించి మాట్లాడేవారు ఈ పిచ్ లపై మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి. లేదంటే నోరుమూసుకోవాలి” అంటూ ఘాటుగానే స్పందించాడు. ఇక రోహిత్ వ్యాఖ్యలపై స్పందించాడు సౌతాఫ్రికా స్పీడ్ స్టర్, మాజీ ప్లేయర్ డేల్ స్టెయిన్. దీంతో కేప్ టౌన్ పిచ్ వివాదం కాస్త వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. తాజాగా న్యూలాండ్ పిచ్ కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. ఇది అసంతృప్తికర పిచ్ అంటూ ఒక డీ మెరిట్ పాయింట్ ను యాడ్ చేసింది. దీంతో కేవలం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పిచ్ పై తనదైన శైలిలో కామెంట్స్ చేయడంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. రోహిత్ కు ఐసీసీ తలొంచిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. సాధారణంగా ఏ పిచ్ కైనా ఐదు సంవత్సరాల కాలంలో 6 డీ మెరిట్ పాయింట్లు వస్తే.. ఆ గ్రౌండ్ లో ఏడాది పాటు ఎలాంటి మ్యాచ్ లు నిర్వహించకుండా ఐసీసీ నిషేధం విధిస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి