iDreamPost

Virat Kohli: కోహ్లీకి ఫ్యాన్స్ వెరైటీ రిక్వెస్ట్.. ఆవేశంతో తిట్టేస్తున్నారు కూడా!

  • Published Jan 31, 2024 | 11:14 AMUpdated Jan 31, 2024 | 11:14 AM

Virat Kohli, India vs England: టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి వింత పరిస్థితి ఎదువుతోంది. అతని అభిమానులు అతని ఒక వెరైటీ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. పైగా.. కొంతమంది అయితే ఏకంగా కోహ్లీని తిడుతున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, India vs England: టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి వింత పరిస్థితి ఎదువుతోంది. అతని అభిమానులు అతని ఒక వెరైటీ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. పైగా.. కొంతమంది అయితే ఏకంగా కోహ్లీని తిడుతున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 31, 2024 | 11:14 AMUpdated Jan 31, 2024 | 11:14 AM
Virat Kohli: కోహ్లీకి ఫ్యాన్స్ వెరైటీ రిక్వెస్ట్.. ఆవేశంతో తిట్టేస్తున్నారు కూడా!

విరాట్‌ కోహ్లీ.. ఈ పేరు చెబితే కొన్ని కోట్ల మంది క్రికెట్‌ అభిమానుల్లో వైబ్రేషన్స్‌ వస్తాయి. అతని ఆట చూసేందుకే కొన్ని లక్షల కాళ్లు స్టేడియానికి కదులుతాయి. కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. అదీ.. కోహ్లీ రేంజ్‌. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ది క్రికెట్‌ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు కోహ్లీ. ఇండియన్‌ క్రికెట్‌లో అతనో సూపర్‌ స్టార్‌. ప్రపంచ క్రికెట్‌కు అతనే ఫేస్‌. అలాంటి ఆటగాడిని ఇప్పుడు అతని అభిమానులే తిడుతున్నారు. ఒక వెరైటీ రిక్వెస్ట్‌తో కోహ్లీని ప్రాధేయపడుతూ.. ఇక చివరికి తిట్టడం కూడా మొదలుపెట్టారు. అది కూడా కోహ్లీ మీద వారికున్న ప్రేమే అనుకోండి. అదే వేరే విషయం. అసలింతకీ.. కోహ్లీ ఫ్యాన్స్‌ కోహ్లీని ఎందుకు తిడుతున్నారు? అతనికి ఏం రిక్వెస్ట్‌ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ రెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. నిజానికి కోహ్లీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ ఆడాల్సింది. దాని కోసం ప్రాక్టీస్‌ కూడా మొదులుపెట్టి.. తొలి మ్యాచ్‌ వేదిక హైదరాబాద్‌కు కూడా వచ్చేశాడు. కానీ, ఏమైందో ఏమో కానీ ఉన్నపళంగా అన్ని సర్దుకుని ఇంటికి వెళ్లిపోయాడు. తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి రెండు టెస్టులకు దూరంగా ఉంటానంటూ బీసీసీఐ నుంచి పర్మిషన్‌ తీసుకుని కోహ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత అ‍డ్రెస్‌ లేడు. కోహ్లీ ఎందుకు ఇంటికి వెళ్లిపోయాడు అనే విషయం ఇప్పటి వరకు బయటికి రాలేదు. కోహ్లీ ఎందుకు అర్ధాంతరంగా వెళ్లిపోయడనే విషయం పక్కనపెడితే.. కోహ్లీ టీమ్‌లో లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో.. కేవలం 231 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల లీడ్‌ దక్కిన తర్వాత కూడా ఓడిపోవడం నిజంగా ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు అవమానం. అయితే.. కోహ్లీ ఉంటే టీమిండియా ఓడిపోయేది కాదని కొంతమంది క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అది నిజం కూడా. ఈ క్రమంలోనే కోహ్లీకి అతని ఫ్యాన్స్‌ ఒక రిక్వెస్ట్‌ చేస్తున్నారు. అదేంటంటే.. అర్జెంట్‌గా వచ్చిన టీమ్‌లో చేరిపోవాలని, విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టులో ఎలాగైన ఆడాలని కోహ్లీకి అతని అభిమానులు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిపోయాం అని.. జడేజా, రాహుల్‌ కూడా లేరని, వైజాగ్‌లో జరిగే రెండో టెస్టులోనూ ఓడిపోతే.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో మరింత దిగజారిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ఎలాగైన తన రెస్ట్‌ను పక్కనపెట్టి మరీ ఇచ్చి.. ఇండియాను గెలిపించాలని కోహ్లీని కోరుకుంటున్నారు.

రోహిత్‌ శర్మ ఒక్కడే కష్టపడుతున్నాడని, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి వాళ్లు ఫామ్‌లో లేరని, జడేజా, రాహుల్‌ గాయలతో దూరం అయ్యారని.. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఒక్కడే టీమిండియాను ఆదుకోగలడని అంటున్నారు. అందుకే.. ఎలాంటి పనిలో ఉన్నా.. అవన్నీ పక్కనపెట్టి.. వచ్చి టీమ్‌లో చేరి రెండో టెస్టు ఆడాలని అంటున్నారు. అయితే.. అది సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే.. కోహ్లీ ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్పితే.. జట్టును వీడి వెళ్లడు. పైగా రెండు టెస్టు కోసం ఇప్పటికే సెలక్టర్లు స్క్వౌడ్‌ను ప్రకటించారు. గాయాలతో జడేజా, రాహుల్‌ దూరం కావడంతో.. యువ క్రికెటర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను రెండో టెస్ట్‌ కోసం ఎంపిక చేశారు. అయినా కూడా దేశం మీద ప్రేమ, కోహ్లీ మీద అభిమానం కొద్ది.. కోహ్లీ వచ్చి రెండో టెస్ట్‌ ఆడాలని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. మరి రెండో టెస్ట్‌ ఆడాలని కోహ్లీని రిక్వెస్ట్‌ చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి