iDreamPost

Pooja Hegde : పూజా అభిమానులకు వరస కానుకలు

Pooja Hegde : పూజా అభిమానులకు వరస కానుకలు

ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే డిమాండ్ మాములుగా లేదు. ఒకప్పుడు ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకుని తెలుగు, తమిళ, హిందీలో డెబ్యూ సినిమాలతో ఫ్లాప్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయింది. అందుకే స్టార్ హీరోలు పోటీ పడి మరీ తనే కావాలని పట్టుబడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో తన సినిమాలు తక్కువ గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ పలకరించబోతున్నాయి. అందులో మొదటిది ఆచార్య. రామ్ చరణ్ సరసన జోడిగా పూజా ఇందులో కీలక పాత్ర పోషించింది. ఫిబ్రవరి విడుదల వాయిదా పడింది కనక అయితే మార్చి లేదా ఏప్రిల్ లో రావడం మాత్రం పక్కా.

ప్రభాస్ తో మొదటిసారి జోడికట్టిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అయ్యాక కొత్త డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. ఇదీ ఏప్రిల్ లేదా మే వైపు చూస్తోంది, పరిస్థితులు కుదుటపడ్డాక నిర్ణయం తీసుకుంటారు. విజయ్ తో చేసిన బీస్ట్ మాత్రం ఏప్రిల్ నే టార్గెట్ చేసింది. అదే నెలలో కెజిఎఫ్ 2 ఉన్నా సరే ఆ డేట్ ని వదిలేసి మరొకటి తీసుకోవాలనే ప్లాన్ లో ఉంది. ఎలా చూసుకున్నా ఏదీ వాయిదా పడినా మహా అయితే మూడు నెలల గ్యాప్ లో ఈ మూడు సినిమాలు రావడం ఖాయం. రణ్వీర్ కపూర్ తో చేసిన సర్కస్ జూలై రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇదీ కన్ఫర్మ్ అయితే కౌంట్ నాలుగుకు పెరుగుతుంది. ఆ స్థాయిలో స్పీడ్ ఉంది మరి

ఎంత మొత్తం అనేది బయటికి చెప్పడం లేదు కానీ సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న పూజా హెగ్డేకి గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒకటే రిలీజ్ అయ్యింది. టాక్ తో సంబంధం లేకుండా అదీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో తన ఆనందం మాములుగా లేదు. ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. పైన చెప్పిన వాటిలో సర్కస్ మినహాయించి మిగిలినవాటికి సంబంధించిన అన్ని పనులు పూజా హెగ్డే పూర్తి చేసింది. సో కొత్త కమిట్ మెంట్స్ కి ఛాన్స్ ఉంది. మరి ఏ సినిమాలు చేయబోతోందో ఎవరి సరసన నటించబోతోందో చూడాలి. మలయాళం ఎంట్రీ కూడా దగ్గర్లో ఉందట

Also Read : Kondapolam : బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ – బుల్లితెరపై సూపర్ హిట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి