iDreamPost

బెంగుళూరులో నయా దందా! డబ్బున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్!

బెంగుళూరులో మరో నయా దందా పుట్టుకొచ్చింది. డబ్బున్న వ్యక్తులనే టార్గెట్ గా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అసలేం జరిగిందంటే?

బెంగుళూరులో మరో నయా దందా పుట్టుకొచ్చింది. డబ్బున్న వ్యక్తులనే టార్గెట్ గా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అసలేం జరిగిందంటే?

బెంగుళూరులో నయా దందా! డబ్బున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో మార్గాలను వెతుక్కుంటూ చివరికి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక అందుబాటులో ఉన్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొందరు వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎంతో మంది ఎన్నో రకాల మోసాలు చేస్తూ ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ, ఇవన్నీ కాకుండా ఇప్పుడు బెంగుళూరులో సరికొత్త దందా వెలుగులోకి వచ్చింది. ఫేక్ యాక్సిడెంట్ లు చేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఇలా ఎంతో మంది వీరి మాయలో మోసపోయి చివరికి లబోదిబోమంటు నెత్తి, నోరు బాదుకుంటున్నారు. అసలు ఫేక్ యాక్సిడెంట్ లతో చేస్తున్న వీరి మోసాలు ఏంటి? కొత్తగా పుట్టుకొచ్చిన ఈ నయా ఫేక్ బిజినెస్ ఏంటంటే?

అసలేం జరిగిందంటే? దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల్లో ఒకటి బెంగుళూరు. దీన్ని వేదికగా చేసుకున్నారు కొందరు కేటుగాళ్లు. ఈజీ మనీ కోసం కొత్త కొత్త ఐడియాతో డబ్బులు గుంజుతున్నారు. వీరి ప్లాన్ ఏంటంటే? డబ్బులు బాగా సంపాదించేవారు, ఐటీ ఉద్యోగులపై వీరు కన్నేస్తారు. ఇక రాత్రి 10 దాటితే చాలు.. ఈ గ్యాంగ్ సభ్యులంతా రోడ్లలపై ఎక్కేస్తారు. ఇక సినిమా స్టైల్ లో ఛేజింగ్ చేసి గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొడతారు. దీంతో మొత్తానికి ఫేక్ యాక్సిడెంట్ ను క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత వారిని కారులోంచి దించే లోపే మిగతా సభ్యులు అంతా వస్తారు. ఏం తెలియదన్నట్లుగా అంతా కలిసి వారితో గొడవ చేస్తారు. అలా వారిని బ్లాక్ మెయిల్ చేసి చివరికి వారి నుంచి ఏకంగా లక్షల్లో సొమ్మును ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇలా ఒకటి కాదు, రెండు.. ఎన్నో ఫేక్ యాక్సిడెంట్ లు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల బెంగుళూరుకు చెందిన ఓ మహిళను అచ్చం ఇలాగే ఫేక్ యాక్సిడెంట్ తో బెదిరించారు. ఆ తర్వాత ఈ ముఠా సభ్యులు ఆ మహిళ నుంచి డబ్బులు గుంజారు. కానీ, ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో తెలియక వారికి కొంత డబ్బును ఇచ్చేసింది. మొత్తానికి ఈ ముఠా సభ్యులు అంతా ఫేక్ యాక్సిడెంట్ ను క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్ తో డబ్బులు సంపాదిస్తున్నారని ఆ మహిళ గుర్తించింది. ఇక ఇదే విషయాన్ని ఆమె భర్తకు వివరించింది. దీంతో ఆ బాధితులు జరిగిన మోసాన్ని ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. బెంగుళూరులో జరుగుతున్న ఈ ఫేక్ యాక్సిడెంట్ పట్ల ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటివి ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కూడా సూచిస్తున్నారు. బెంగుళూరులో ఫేక్ యాక్సిడెంట్ లతో నయా దందాకు తెర లేపిన ఈ ముఠా సభ్యుల వరుస దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి