iDreamPost

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫీజు గడువు పొడిగింపు!

Inter Exam Fee: ఇంటర్ పరీక్షలకు సంబంధించి తరచూ ఏదో ఒక సమాచారం వస్తుంది. తాజాగా ఇంటర్ పరీక్షల ఫీజులు చెల్లింపులను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఎప్పటి వరకు గడువు పెంచింది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Inter Exam Fee: ఇంటర్ పరీక్షలకు సంబంధించి తరచూ ఏదో ఒక సమాచారం వస్తుంది. తాజాగా ఇంటర్ పరీక్షల ఫీజులు చెల్లింపులను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఎప్పటి వరకు గడువు పెంచింది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫీజు గడువు పొడిగింపు!

ఆంధ్రప్రదేశ్ లో 2024 మార్చిలో జరగనున్న ఇంటర్ పరీక్షల కు సంబంధించి కీలక సమాచారం ఒకటి బయటకు వచ్చింది. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.  ఇంటర్ రెగ్యులర్, ఓకేషన్ల కోర్సుల కు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. అలానే వార్షిక పరీక్షలకు ఫీజులు చెల్లింపులు ప్రారంభమైన విషయం అందరికి విధితమే. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 30తో నే ముగిసింది. ఈ క్రమంలోనే ఇంటర్ పరీక్ష ఫీజుపై ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. గతంలో ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువు నవంబర్‌ 30 వరకు పెట్టింది. అయితే.. ఇంకా పలువురు విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని సమాచారం. అలా ఫీజు చెల్లించని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి మరో 5 రోజుల పాటు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది.  అంటే  డిసెంబర్ 5 వరకు ఫీజులు చెల్లించుకోవచ్చు. రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులకు ఆలస్య రుసుం లేకుండా డిసెంబర్‌ 5 వరకు ఫీజులు చెల్లించ వచ్చు. అలానే ఆలస్య  రుసుంతో రూ. 1000 ఆలస్య డిసెంబర్‌ 15 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు వెల్లడించింది. ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లింపు విషయంలో చేసిన మార్పులపై గురువారం (నవంబర్ 30) ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

మొదటి లేదా రెండో  ఏడాది థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. అలానే ఇంటర్ రెండేళ్ల పరీక్షలకు రూ.1100,  అదే విధంగా ఒకేషనల్‌ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500 గా పేర్కొంది. ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు పరీక్ష రూ.300 ఫీజు చెల్లించాలి. ఇప్పటికే ఇంటర్‌ పాసై ఇంప్రుమెంట్ రాసేవారు రెండేళ్లకు కలిపి ఆర్ట్స్‌ కోర్సులకు అయితే రూ.1240, సైన్స్‌ కోర్సులకు అయితే రూ.1440 సంబంధిత కాలేజీల్లో చెల్లించాలి. తాజాగా చేసిన మార్పులను వివరిస్తూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వూలు జారీ చేశారు. మరి.. ఇంటర్ పరీక్షా ఫీజుల గడువు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి