iDreamPost

పుష్ప- 2 లీక్స్ చూస్తే.. గ్లోబల్ హిట్ పక్కానా?

పుష్ప- 2 లీక్స్ చూస్తే.. గ్లోబల్ హిట్ పక్కానా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప-2 ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ రెండు పేర్లు ఫుల్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఒక నటుడిగా కెరీర్ లో ఎదగడం మాత్రమే కాదు.. టాలీవుడ్ గౌరవాన్ని ప్రతిష్టను కూడా అంచలంచెలుగా పెంచుతున్నాడు. పుష్ప సినిమాతో ఇండియన్ సినిమాని రూల్ చేయడం, జాతీయ అవార్డు సాధించడం, ఇన్ స్టాగ్రామ్ వాళ్లే స్వయంగా వచ్చి అల్లు అర్జున్ డైలీ రొటీన్ అంటూ వీడియో తీసి ప్రమోట్ చేయడం చూస్తుంటే.. పోసాని కృష్ణ మురళి చెప్పినట్లు బన్నీ ఆస్కార్ సాధించే స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులకు ఇంకో సర్ ప్రైజ్ ఉండబోతోంది అని చెప్పచ్చు.

పుష్ప సినిమా గురించి పాన్ ఇండియా స్థాయిలో ఎవరికీ ఇంట్రడక్షన్స్ ఇవ్వాల్సిన అసవరం లేని సినిమా. టాలీవుడ్ స్థాయిని ఇండియా లెవల్లో చాటి చెప్పిన మూవీ అది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో కూడా అభిమానులు పెరిగిపోయారు. పుష్ప 2 సినిమా ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మూవీ నుంచి అప్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు అంటూ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్- ఇన్ స్టాగ్రామ్ సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ మీద స్పెషల్ వీడియో షూట్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియో క్లియర్ గా గమనిస్తే పుష్ప- 2 సినిమా ఏ స్థాయి విజయం సాధించబోతోందో చెప్పచ్చు.

పుష్ప మూవీ పార్ట్ 1లో పుష్పరాజ్ సిండికేట్ హెడ్ అయ్యి స్మగ్లింగ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లడం చూశాం. నిజానికి గట్టి విలన్స్ అనుకున్న వాళ్లు మొదటి పార్ట్ లోనే చనిపోయారు. కానీ, ఐపీఎస్ షెకావత్ ని మాత్రం పుష్పకి వ్యతిరేకంగా చూపిస్తూ ఫస్ట్ పార్ట్ ని ఎండ్ చేశారు. ఆ ప్రకారం అప్పటికి షెకావత్ తప్ప పుష్పకు ఎవరూ శత్రువులు లేరు. షెకావత్ పాత్రను పరిచయం చేస్తున్న సమయంలోనే పడుకునేందుకు చోటు లేదని ఇద్దరి ప్రాణాలు తీసిన క్రూరమైన పాత్రలో చూపించారు. అంటే షెకావత్ ను పుష్పకు విలన్ గా అనుకోవచ్చు. తాజా వీడియోలో ఒక గోడౌన్ లో ఉన్న ఎర్రచందనం దుంగలను హడావుడిగా లారీలో ఎక్కిస్తున్న సీన్ చేశారు. అంటే పార్ట్ 2లో షెకావత్ పుష్ప రాజ్ ని గట్టిగానే కౌంటర్ చేసినట్లు అనుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

పుష్ప 2 గ్లింప్స్ లో మాత్రం అల్లు అర్జున్ ఎవరూ అందుకోలేని స్థాయికి వెళ్లినట్లు చూపించారు. ఆ స్థాయికి షెకావత్ విలనిజం సరిపోదనే చెప్పాలి. అంటే పార్ట్ 2 లో కచ్చితంగా కొత్త విలన్స్ ని పరిచయం చేసే అవకాశం ఉంది. ఇన్ స్టాగ్రామ్ వాళ్లు రిలీజ్ చేసిన వీడియోలో పుష్ప-2 షూటింగ్ గురించి చెబుతూ అల్లు అర్జున్ తన ముఖంపై గాటు ఉంటుందని రివీల్ చేశాడు. పార్ట్ 1లో తనకు ఆ గాటు లేదని పార్ట్ 2లో ఉంటుందని చెప్పాడు. అంటే పుష్ప రాజ్ కు గట్టిగానే పోరాట సన్నివేశాలు ఉన్నాయి. పైగా పుష్ప రాజ్ జైలు నుంచి తప్పించుకున్నాడు అని చెప్పారు. అసలు పుష్పరాజ్ జైలుకు ఎలా వెళ్లాడు? ఎంపీ సపోర్ట్ ఉన్న పుష్పని ఎవరు టార్గెట్ చేశారు? అలాంటి ప్రశ్నలకు సుకుమార్ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ.. మారుమూల కథను తీయాలి అనుకున్న మా ప్రయత్నాలు ఫలించాయన్నారు. అందరి దృష్టిని ఆకర్షించేలా పుష్ప-2 సినిమా తీస్తున్నామన్నారు. ఒక లోకల్ సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్తుందని చెప్పిన వ్యాఖ్యలు చూస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కు ఉన్న క్రేజ్ కి తగ్గట్లు సుకుమార్ అవుట్ పుట్ తీసుకొస్తే.. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే నిలిచిపోయే సినిమా పుష్ప-2 అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. పుష్ప-2 సినిమా కోసం మీరూ వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Instagram (@instagram)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి