iDreamPost
android-app
ios-app

కన్నప్పలో ప్రభాస్ చేసే పాత్ర ఇదే! శివుడిగా మాత్రం కాదు..

Prabhas- Kannappa Movie: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్ లో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్పలో చేయబోతున్నాడు. అలాగే ఆ మూవీలో ప్రభాస్ చేయబోచే పాత్ర గురించి కూడా క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

Prabhas- Kannappa Movie: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్ లో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్పలో చేయబోతున్నాడు. అలాగే ఆ మూవీలో ప్రభాస్ చేయబోచే పాత్ర గురించి కూడా క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

కన్నప్పలో ప్రభాస్ చేసే పాత్ర ఇదే! శివుడిగా మాత్రం కాదు..

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. కల్కి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత రాజాసాబ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అంటున్నారు. అయితే ఈ గ్యాప్ లో ప్రభాస్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నాడు అంటున్నారు. అది మరేదో మూవీ కాదు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’లోనే. అవును కల్కి 2898 ఏడీ చిత్రం పూర్తవ్వగానే కన్నప్ప కోసం ప్రభాస్ డేట్స్ ఇవ్వబోతున్నాడు అని టాక్ నడుస్తోంది. అయితే ఇన్నాల్లు కన్నప్ప చిత్రంలో ప్రభాస్ చేస్తోంది శివుడి పాత్ర అనుకుంటూ వస్తున్నారు. కానీ, కన్నప్పలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించడం లేదు అని టాలీవుడ్ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే న్యూజిల్యాండ్ లో కీలక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీలో నయనతార, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, బ్రహ్మానందం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ చేస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఏ పాత్ర అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ, ప్రభాస్ మాత్రం శివుడి పాత్ర చేస్తున్నాడు అని అంతా ఫిక్స్ అయిపోయారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అవే గుసగుసలు సాగాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ పాత్ర విషయంలో ఒక క్రేజీ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రభాస్ చేయబోయేది శివుడి పాత్ర కాదు అని బల్లగుద్ది చెప్తున్నారు.

అవును.. కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేయబోయే పాత్ర శివుడి క్యారెక్టర్ కాదంట. నిజానికి మంచు విష్ణు మాత్రం ప్రభాస్ శివుడి పాత్రే చేయాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం అంత భారం తాను మోయలేనని సున్నితంగా తిరస్కరించాడంట. కానీ, ఆఖరికి నందీశ్వరుడి పాత్రలో చేసేందుకు మాత్రం అంగీకారం తెలిపినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కల్కీ 2898 ఏడీ మూవీకి గుమ్మడికాయ కొట్టగానే కన్నప్ప చిత్రానికి డేట్స్ ఇవ్వడానికి డార్లింగ్ రెడీగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించబోతున్నాడు అంటున్నారు. ఇటీవలే ఓమై గాడ్ 2 చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడిగా చేసిన విషయం తెలిసిందే.

మంచు విష్ణు తీస్తున్న కన్నప్ప మూవీలో కూడా శివుడి పాత్రకు అక్షయ్ కుమార్ ని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. అదే జరిగితే ఇది కన్నప్ప సినిమాకి సంబంధించి బిగ్ అప్ డేట్ అనే చెప్పాలి. కల్కీ, కన్నప్ప తర్వాత ప్రభాస్ డైరెక్టర్ మారుతీ ప్రాజెక్ట్ ది రాజా సాబ్ సెట్స్ లో పాల్గొంటాడు. 2025 జనవరిలో ది రాజా సాబ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ కథను 60 శాతం వరకు కంప్లీట్ చేసినట్లు ప్రకటించాడు. డిసెంబర్ నాటికి స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తాను అని చెబుతున్నారు. మరి.. కన్నప్పలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet