iDreamPost

విషాదం.. 25 ఏళ్లకే యువ నటుడు కన్నుమూత!

  • Author Soma Sekhar Published - 10:19 AM, Tue - 1 August 23
  • Author Soma Sekhar Published - 10:19 AM, Tue - 1 August 23
విషాదం.. 25 ఏళ్లకే యువ నటుడు కన్నుమూత!

సాధారణంగా కొంతమంది నటీ, నటులకు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు రావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇక మరికొంత మందికి ఒకే ఒక్క సినిమాతోనో లేక సిరీస్ తోనో వరల్డ్ వైడ్ గా గుర్తింపు వస్తుంది. అలా ఒకే ఒక్క డ్రామా సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ 25 ఏళ్ల యంగ్ యాక్టర్. కానీ విధి వెక్కిరించడంతో.. 25 ఏళ్లకే తనువు చాలించాడు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నటుడి పేరు ఎంగస్ క్లౌడ్. ‘యూఫోరియా’ డ్రామా సిరీస్ తో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. అతడి మరణంతో ప్రపంచ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

ఎంగస్ క్లౌడ్ (25).. HBOలో అత్యంత ప్రేక్షకాదారణ పొందిన డ్రామాగా ప్రసారమైన ‘యూఫోరియా’ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు ఎంగస్ క్లౌడ్. అయితే తన తండ్రి మరణించడంతో.. తీవ్ర మానసిక వేదనకు గురైయ్యాడు క్లౌడ్. ఇది అతడి ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో.. మనసికంగా కుంగుబాటుకు లోనై.. మరణించినట్లుగా అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మీ అవార్డు గెలుచుకున్న యూఫోరియా డ్రామాలో ఎంగస్.. డ్రగ్ డీలర్ పాత్రను అద్భుతంగా షోషించాడు. ఈ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు ఎంగస్ క్లౌడ్. నార్త్ హాలీవుడ్, ద థింగ్స్ డే క్యారీడ్, ది లైన్ లాంటి చిత్రాలతో పాటుగా పలు టీవీ షోల్లోనూ నటించాడు ఎంగస్ క్లౌడ్. ఇంత చిన్న వయసులోనే స్టార్ నటుడు మరణించడం బాధాకరమైన విషయం అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Actor angus cloud passed away

ఇదికూడా చదవండి: యూట్యూబ్ యాంకర్ ని పెళ్లి చేసుకోబోతున్న హైపర్ ఆది..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి