iDreamPost

వివేకా హత్య కేసు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ బెయిల్‌

వివేకా హత్య కేసు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ బెయిల్‌

2019 మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి మృతి తీవ్ర కలకలం రేపింది. మొదటగా వైఎస్ వివేకా గుండుపోటుతో మరణించాడనే వార్తలొచ్చినా ఆ తరువాత పోలీసుల దర్యాప్తులో హత్యగా తేలింది. ఈ హత్యపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కాగా వివేకా హత్యకేసులో తెలంగాణ సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించి అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అతడు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తాజాగా భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా అనారోగ్య కారణాల దృష్ట్యా భాస్కర్ రెడ్డి బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎస్కార్ట్‌ బెయిల్‌లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్‌ వెహికిల్‌ ఉంటాయి. ఎస్కార్ట్‌ బెయిల్‌లో వీళ్లు భాస్కర్‌ రెడ్డి వెంటే ఉండనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి