iDreamPost

సిరీస్ ఓటమి.. బజ్ బాల్ కు కొత్త నిర్వచనం చెప్పిన బెన్ స్టోక్స్!

ఇండియాపై సిరీస్ ఓటమి తర్వాత బజ్ బాల్ కు సరికొత్త నిర్వచనం చెప్పుకొచ్చాడు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్. మరి ఆ నిర్వచనం ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇండియాపై సిరీస్ ఓటమి తర్వాత బజ్ బాల్ కు సరికొత్త నిర్వచనం చెప్పుకొచ్చాడు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్. మరి ఆ నిర్వచనం ఏంటో తెలుసుకుందాం పదండి.

సిరీస్ ఓటమి.. బజ్ బాల్ కు కొత్త నిర్వచనం చెప్పిన బెన్ స్టోక్స్!

బజ్ బాల్.. గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. దానికి ఆజ్యం పోసింది మేమే అంటూ.. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కొవాలంటూ ఇతర జట్లకు సవాల్ విసిరారు ఇంగ్లండ్ క్రికెటర్లు. అయితే వారి గొప్పలు ఎన్నో రోజులు సాగలేదు. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం ఇండియాలో అడుగుపెట్టిన ఇంగ్లీష్ జట్టుకు కోలుకోలేని షాకిచ్చింది టీమిండియా. సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుని బజ్ బాల్ గిజ్ బాల్ జాంతానయ్ అని చాటిచెప్పింది. ఇక సిరీస్ ఓటమి తర్వాత బజ్ బాల్ కు సరికొత్త నిర్వచనం చెప్పుకొచ్చాడు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్. మరి ఆ నిర్వచనం ఏంటో చూద్దాం పదండి.

బజ్ బాల్.. ఒక్క మాటలో చెప్పాలంటే టెస్ట్ క్రికెట్ లో వేగంగా పరుగులు రాబట్టడం. త్వరగా మ్యాచ్ లను ముగించడం. ప్రపంచ క్రికెట్ కు ఇంగ్లండ్ నేర్పిన సరికొత్త స్ట్రాటజీ ఇది. గతంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై ఇది బాగానే పనిచేసినప్పటికీ.. ఇండియాపై మాత్రం అది పారలేదు. ఇంగ్లండ్ కే సరికొత్త బజ్ బాల్ అటను చూపించారు టీమిండియా కుర్రాళ్లు. మరీ ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే సిరీస్ ఓడిపోయిన తర్వాత తమ బజ్ బాల్ కు మరో సరికొత్త నిర్వచనం చెప్పాడు కెప్టెన్ బెన్ స్టోక్స్.

మ్యాచ్ అనంతరం బజ్ బాల్ గురించి బెన్ స్టోక్స్ మాట్లాడుతూ..”ప్రతీ ఒక్కరు బజ్ బాల్ అంటే ఏంటి? అని అడుగుతూ ఉంటారు. దానికి అర్థం సరికొత్త ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావడమే. అయితే ఈ క్రమంలో గెలుపు, ఓటములు అనేవి సర్వసాధారణం. కొత్త ఆటగాళ్లతో పాటుగా ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో ఉన్న సత్తాను ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రేక్షకులను తమ ఆటతీరుతో అలరించడమే బజ్ బాల్ ముఖ్య ఉద్దేశం. కేవలం వేగంగా ఆడటమే కాదు” అంటూ సరికొత్త నిర్వచనం చెప్పుకొచ్చాడు స్టోక్స్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ కావడంతో.. సిరీస్ ఓడిపోవడంతో బజ్ బాల్ పొగరు తగ్గిందా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బజ్ బాల్ గురించి స్టోక్స్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: నాటి రోహిత్ వార్నింగ్.. నేడు సర్ఫరాజ్ ను సేవ్ చేసింది! ఏం జరిగిందంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి