iDreamPost

ఆ స్టార్ బ్యాటర్ కు బౌలింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుడుతుంది: మార్క్‌ వుడ్‌

టీమిండియాలో ఉన్న ఆ స్టార్ బ్యాటర్ కు బౌలింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టడమే కాకుండా.. అతడు కలలో కూడా భయపెట్టేవాడని భారత స్టార్ ప్లేయర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్. మరి మార్క్ వుడ్ ను అంతలా భయపెట్టిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

టీమిండియాలో ఉన్న ఆ స్టార్ బ్యాటర్ కు బౌలింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టడమే కాకుండా.. అతడు కలలో కూడా భయపెట్టేవాడని భారత స్టార్ ప్లేయర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్. మరి మార్క్ వుడ్ ను అంతలా భయపెట్టిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆ స్టార్ బ్యాటర్ కు బౌలింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుడుతుంది: మార్క్‌ వుడ్‌

ప్రపంచంలో ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లు, బౌలర్లు ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ.. వారికి నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తారు. అలాంటి నిద్రలేని రాత్రులను తనకు ఓ టీమిండియా స్టార్ బ్యాటర్ పరిచయం చేశాడని, అతడి బ్యాటింగ్ నన్ను ఓ పీడకలలాగా వెంటాడుతోందని చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్. ఆ స్టార్ ప్లేయర్ షాట్స్ నన్ను కలలో కూడా భయపెట్టేవి అంటూ చెప్పుకొచ్చాడు ఈ ఇంగ్లీష్ బౌలర్. మరి మార్క్ వుడ్ ను అంతలా భయపెట్టిన ఆ స్టార్ బ్యాటర్ ఎవరు?

టీమిండియాలో ఎంతో మంది స్టార్ బ్యాటర్లు ఉన్నారు. ఎవరికి వారే తమ స్టైల్లో చెలరేగుతూ.. ప్రత్యర్థి బౌలర్లకు పీడకలను మిగుల్చుతూ వస్తున్నారు. అయితే వరల్డ్ వైడ్ గా ఉన్న కొందరు బౌలర్లకు మాత్రం కొంత మంది బ్యాటర్లు పీడకలలా మారుతూ ఉంటారు. తనదైన బ్యాటింగ్ తో సదరు బౌలర్ కు చుక్కలు చూపిస్తారు. ఇక ఇలాంటి ఆటగాడిని ఎన్నటికీ ఆ బౌలర్ మర్చిపోడు. తాజాగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్ ఓ టీమిండియా బ్యాటర్ తన బ్యాటింగ్ తో తనకు పీడకలలా రాత్రివేళ భయపెట్టేవాడు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇంతకీ మార్క్ వుడ్ ను భయపెట్టింది ఎవరో తెలుసా? టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పుకొచ్చాడు.

రోహిత్ గురించి ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్ మాట్లాడుతూ..”నన్ను రాత్రివేళ కలలో కూడా భయపెట్టే బ్యాటర్ రోహిత్ శర్మ ఒక్కడే. అతడికి బౌలింగ్ చేయాలంటే మాకు వెన్నులో వణుకు పుడుతుంది. అతడు అన్ని షాట్స్ ఆడగలడు, పైగా సిక్స్ లను అతవోకగా కొట్టగలడు. అందుకే రోహిత్ ఆట చూడముచ్చటగా చూడబుద్దైతుంది. ఇక రోహిత్ ఆడుతున్నంత సేపు మ్యాచ్ హైలైట్స్ చూసినట్లే ఉంటుంది. ఎంత అద్భుతమైన షాట్ అని మనల్నే అనేలా చేస్తాడు” అంటూ రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేశాడు మార్క్ వుడ్. కాగా.. ఇంగ్లాండ్ త్వరలోనే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో టీమిండియాతో తలపడబోతోంది. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి మార్చ్ 11 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే మార్క్ వుడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరి మార్క్ వుడ్ రోహిత్ పై చేసిన వ్యాఖ్యలు మీకు ఏవిధంగా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Anari (@cricketanari)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి