iDreamPost

క్లాసెన్, మార్​క్రమ్ కాదు.. సౌతాఫ్రికాకు కొత్త సూపర్​స్టార్ దొరికేశాడు!

  • Author singhj Published - 09:43 PM, Sat - 21 October 23

సౌతాఫ్రికాకు కొత్త సూపర్​స్టార్ దొరికేశాడు. ధనాధన్ బ్యాటింగ్​తో అదరగొడుతున్న ఆ క్రికెటర్.. మంచి పేస్​తో బౌలింగ్ వేస్తూ కీలక టైమ్​లో వికెట్లు తీస్తున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?

సౌతాఫ్రికాకు కొత్త సూపర్​స్టార్ దొరికేశాడు. ధనాధన్ బ్యాటింగ్​తో అదరగొడుతున్న ఆ క్రికెటర్.. మంచి పేస్​తో బౌలింగ్ వేస్తూ కీలక టైమ్​లో వికెట్లు తీస్తున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?

  • Author singhj Published - 09:43 PM, Sat - 21 October 23
క్లాసెన్, మార్​క్రమ్ కాదు.. సౌతాఫ్రికాకు కొత్త సూపర్​స్టార్ దొరికేశాడు!

వన్డే వరల్డ్ కప్​లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. మెగా టోర్నీ మొదలవ్వడానికి ముందు సఫారీ జట్టుపై ఎవరికీ పెద్దగా ఎక్స్​పెక్టేషన్స్ లేవు. బ్యాటింగ్​లో క్లాసెన్, మార్​క్రమ్, మిల్లర్ లాంటి స్టార్లు ఉన్నా వాళ్లు ఎంతవరకు రాణిస్తారో చెప్పలేని పరిస్థితి. వీళ్లు నిలకడగా, కలసికట్టుగా ఆడగలరా అనే సందేహం ఉండేది. కగిసో రబాడ, లుంగీ ఎంగిడీ మాత్రమే ఆ టీమ్ బౌలింగ్ అటాక్​లో చెప్పుకోదగ్గ పేర్లు. దీంతో ప్రత్యర్థులను బవుమా సేన ఆలౌట్ చేయగలదా అనే అనుమానం తలెత్తింది. అయితే టోర్నీలోకి అండర్​డాగ్స్​గా అడుగు పెట్టిన సౌతాఫ్రికా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పసికూన నెదర్లాండ్స్​ చేతిలో ఓటమిని మినహాయిస్తే ఆడిన మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ నెగ్గి హాట్ ఫేవరెట్స్​గా అవతరించింది.

బ్యాటింగ్​లో సీనియర్లు డికాక్, మిల్లర్​తో పాటు రీజా హెండ్రిక్స్, వాండర్ డస్సెన్, మార్క్​రమ్ రాణిస్తున్నారు. బౌలింగ్​లో ఎంగిడి, రబాడలకు తోడు గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహారాజ్ చెలరేగుతుండటంతో సౌతాఫ్రికాను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. అయితే పైన చెప్పిన ప్లేయర్ల కంటే సఫారీ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మరో ఆటగాడు ఉన్నాడు. అతనే మార్కో జాన్సేన్. 23 ఏళ్ల ఈ యంగ్ ఆల్​రౌండర్ అటు బౌలింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ రాణిస్తూ టీమ్​కు మంచి బ్యాలెన్స్ తీసుకొస్తున్నాడు. జహీర్ ఖాన్​లా లెఫ్టార్మ్ పేసర్ అయిన జాన్సేన్.. బ్రేక్ త్రూ అవసరమైన టైమ్​లో వికెట్లు తీస్తున్నాడు. బ్యాటింగ్​లోనూ అదరగొడుతూ ఏడో నంబర్​లో విలువైన రన్స్ చేస్తూ టీమ్​ భారీ స్కోరును అందుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.

ఇంగ్లండ్​తో శనివారం జరిగిన మ్యాచ్​లో ఒక దశలో సౌతాఫ్రికా 300 రన్స్ చేస్తుందా అనే డౌట్ వచ్చింది. ఆ టైమ్​లో అగ్నికి ఆయువులా క్లాసెన్​కు తోడైన జాన్సెన్ (42 బంతుల్లో 78) ధనాధన్ ఇన్నింగ్స్​తో ఇంగ్లీష్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో ఆ టీమ్ ఏకంగా 399 రన్స్ చేసింది. జాన్సెన్ ఇన్నింగ్స్​లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌలింగ్​లోనూ రెండు వికెట్లు తీసి గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. బౌలింగ్​లో జహీర్​లా కవ్వించి ఔట్ చేస్తున్న జాన్సేన్.. బ్యాటింగ్​లో యువరాజ్​లా ప్రత్యర్థులపై భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అతడు ఇదే నిలకడతో ఆడుతూ పోతే ఫ్యూచర్​లో స్టార్ ప్లేయర్​గా ఎదిగే ఛాన్స్ ఉంది. జాన్సేన్ ఆట చూసిన ఫ్యాన్స్ అతడ్ని నయా సూపర్ స్టార్ అంటున్నారు. మరి.. జాన్సెన్​ గేమ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్ అంత రాణిస్తున్నా క్లాసెన్ వెనుకే.. ఆ విషయంలో సఫారీ బ్యాట్స్​మనే గొప్ప!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి