iDreamPost

మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ సార్.. CM జగన్ పై ఏలూరు TDP ఇన్ ఛార్జ్ ప్రశంసలు..

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు అనేక విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఓ నేత మాత్రం సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మరి.. ఆయన ఎవరు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు అనేక విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఓ నేత మాత్రం సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మరి.. ఆయన ఎవరు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ సార్.. CM జగన్ పై ఏలూరు  TDP ఇన్ ఛార్జ్ ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాలను అందిస్తూ వారి మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. సామాజిక న్యాయమే తన లక్ష్యంగా తన పరిపాలనలో మార్క్ చూపించారు. కేవలం పరిపాలన విషయంలోనే కాకుండా తన పార్టీలో టికెట్ల కేటాయింపుల విషయంలో కూడా సామాజిక న్యాయం పాటించారు. వైసీపీ అభ్యుర్థుల జాబితాలో  బీసీలకు పెద్ద పీట వేశారు. చంద్రబాబు మాత్రం నమ్మిన వారికి వెన్నుపోటు పొడుస్తూ.. డబ్బున్న వారికే టికెట్లు కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పలువురు టీడీపీ నేతలు ప్రశంసలు కురిస్తున్నారు. తాజాగా ఏలూరు టీడీపీ ఇన్ ఛార్జీ సీఎం జగన్ ను ప్రశంసించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఏలూరు లోక్ సభ స్థానంలో టీడీపీ ఇన్ ఛార్జీగా ఉన్న గోపాల్ యాదవ్ పేరు లేదు.  ఆయన స్థానంలో కడప జిల్లాకు చెందిన పుట్ట మహేశ్ యాదవ్ ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో గోపాల్ యాదవ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు. తాను పార్టీ పరంగానే ఏమైనా విమర్శలు చేశాను తప్పా.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని గోపాల్ యాదవ్ చెప్పుకొచ్చారు. తనకే టికెట్ అంటూ చంద్రబాబు నమ్మించి…తీరా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా  గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. “మీ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా నేను మెచ్చుకుంటాను. జగన్‌మోహన్‌ రెడ్డి గారు మీ పార్టీ గురించి నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. పార్టీ గురించి తప్ప మీ మీద ఎప్పుడూ నాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు’’ అని గోపాల్ యాదవ్  చెప్పుకొచ్చారు.

ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్ యాదవ్ ను చంద్రబాబు ప్రకటించడంతో ఆ నియోజవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ 25 ఎంపీ  స్థానాల్లో 6 రిజర్వడ్ స్థానాలు పోను మిగిలిన 19 స్థానాలకుగాను 11 చోట్ల బీసీలకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ ఇచ్చిన స్థాయిలో టీడీపీ ఇవ్వలేదని తెలిపారు. టీడీపీ ఇటు వైజాగ్ నుంచి తిరుపతి వరకు ఎక్కువ స్థానాలను ఓసీలకు ఇచ్చుకుంటుందని తెలిపారు. అలానే ఏలూరు టికెట్ తనకు ఇస్తానని చెప్పి కడప వ్యక్తికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాకు చెందిన యాదవ్ వ్యక్తిని ఉభయగోదావరి జిల్లాలో రుద్దే ప్రయత్నం టీడీపీ చేస్తుందని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన తెలిపారు.

తాను రాజకీయంగా కష్ట నష్టాలు అన్నీ భరించానని, ఎవరి అండలేకుండానే ఉన్నత స్థాయి వచ్చని తెలిపారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందని, టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ ను ప్రశంసించారు. రాజకీయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నా సీఎం జగన్ ధైర్యాన్ని మెచ్చుకుంటా, వైసీపీ గురించి తప్పుగా మాట్లాడి ఉంటే తనను క్షమించాలంటూ గోపాల్ యాదవ్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి