iDreamPost

టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు భారీ షాక్.. 1.64 లక్షల కోట్ల నష్టం!

టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు భారీ షాక్.. 1.64 లక్షల కోట్ల నష్టం!

ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ కు గట్టి షాకే తగిలింది. ఎప్పుడూ తన మాటలు, ట్వీట్లతో అందరికీ షాకిస్తూ ఉంటాడు మస్క్. కానీ, ఈసారి ఆయనకు షాక్ తగిలింది. ఆయన చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో ఏకంగా 20.3 బిలియన్ డాలర్లు(రూ.1.64 లక్షల కోట్లు) కోల్పోయారు. తాజా నష్టంతో మస్క్ నెట్ వర్త్ 234.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇది 7వ అతిపెద్ద పతనంగా చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నష్టంతో ప్రపంచ ప్రథమ ధనవంతుడిగా ఉన్న మస్క్ స్థానం కూడా ప్రమాదంలో పడినట్లు అయ్యింది.

అసలు ఏం జరిగిందంటే.. ఎలన్ మస్క్ కు ఎన్ని వ్యాపారాలు ఉన్నా కూడా ప్రధాన వనరు మాత్రం టెస్లా కంపెనీ అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ గురించి మాట్లాడుతూ టెస్లా కార్ల ధరలు ఇంకా తగ్గించాల్సి వస్తుందేమో అంటూ హెచ్చరించారు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో కంపెనీ షేర్ హోల్డర్స్ లో గుబులు మొదలైంది. దాంతో జులై 20న ఒక్కరోజే 9.7 శాతం క్షీణించాయి. అంతేకాకుండా ఏప్రిల్ నెల నుంచి అవి తగ్గుతూనే ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా మస్క్ వెల్లడించారు. ఈ నష్టంతో ప్రపంచ కుబైరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న మస్కుకు.. 201 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో రెండో స్థానంలో ఉన్న ఎల్వీఎంహెచ్ కంపెనీ అధినేత బెర్నాడ్ ఆర్నాల్డ్ కు మధ్య వ్యత్యాసం కేవలం 33 బిలియన్ డాలర్లు మాత్రమే.

అయితే ఇలా నష్టపోయిన వ్యక్తి మస్క్ ఒక్కడే అనుకోకండి. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఒరాకల్ కార్ప్స్ అధినేత ల్యారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్, మార్క్ జుకర్ బర్గ్, ఆల్ఫాబెట్ కో ఫౌండర్స్ ల్యారీ పేజ్- సెర్జీ బ్రిన్ షెడ్ ఉన్నారు. అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్ డాక్ 100 ఇండెక్స్ 2.3 శాతం కుంగింది. దాంతో ఈ కుబేరులు అందరూ కలిపి 20.8 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అందరి సంగతి పక్కన పెడితే మస్క్ మాత్రం బిందాస్ గానే ఉంటాడని చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఎదురుదెబ్బలు మస్క్ కు కొత్తేం కాదు. ఆస్తి కోల్పోవడంలో ఎలాన్ మస్క్ గిన్నిస్ రికార్డు సృష్టిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి