iDreamPost

బంగాళాఖాతంలో భూకంపం.. పోటెత్తిన అలలు..!

  • Published Nov 07, 2023 | 12:11 PMUpdated Nov 07, 2023 | 12:11 PM

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టర్కీ-సిరియాలో సంభవించిన భూకంప విషాదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. భారత్ లో వరుస భూకంపాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టర్కీ-సిరియాలో సంభవించిన భూకంప విషాదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. భారత్ లో వరుస భూకంపాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

  • Published Nov 07, 2023 | 12:11 PMUpdated Nov 07, 2023 | 12:11 PM
బంగాళాఖాతంలో భూకంపం.. పోటెత్తిన అలలు..!

ఈ మద్య ప్రపంచంలో వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. గత నెల ఆఫ్ఘనిస్థాన్ లో ఒకే చోట మూడు సార్లు భూకంపం రావడంతో రెండు వేలకు పైగా మరణాలు సంభవించగా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. శుక్రవారం నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. నేపాల్ లో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి దాదాపు రెండువందల మంది ప్రాణాలు కోల్పోయారు.. వందల మంది గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఖాట్మాండ్ లో సోమవారం 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ భూకంపం ప్రభావం భారత్ పై కూడా పడింది. ఢిల్లీలో నిన్న సాయంత్రం 4.20 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.6 గా నమోదు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో వరుసగా రెండు సార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. తాజాగా బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం సంభవించిది. దీంతో ఒక్కసారిగా సముద్ర తీరంలో అలలు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారు జామున 5.32 గంటల ప్రాంగంలో బంగాళాఖాతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.2 గా నమోదు అయ్యిందని.. సేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులకు వాయువ్య దిశగా దాదాపు రెండు వందల నాటికల్ మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ఇది సముద్ర గర్భంలో సుమారు పది కిలోమీటర్ల లోతులో కదిలికలు జరిగినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. ఈ భూకంపం వల్ల అండమాన్ నికోబార్ దీవులపై తీవ్ర ప్రభావం చూపించిందని అంటున్నారు. తీరంలో అలలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారు. కాకపోతే సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, చైనా, నేపాల్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఎక్కువగా భూపంపాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరికొన్ని దేశాల్లో వరుస భూకంపాలు వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గత నెల ఆఫ్ఘనిస్థాన్ లో భూకంప విషాదం నుంచి కోలుకోక ముందే.. నేపాల్ లో భూకంపం ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇక భారత్ లో సైతం ఇటీవల వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం పెద్దాల లేకపోయినా.. ఢిల్లీ, బీహార్, హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బంగాళా ఖాతంలో వచ్చిన భూకంపం ప్రభావం వల్ల సముద్రంలో అలజడి చెలరేగింది. అలలు భారీ ఎత్తున పోటెత్తడంతో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి