• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » E Watch App Stopped By Andra Pradesh High Court

ఈ వాచ్‌కు హైకోర్టులో బ్రేక్‌..!

  • By Idream media Published Date - 09:03 AM, Fri - 5 February 21 IST
ఈ వాచ్‌కు హైకోర్టులో బ్రేక్‌..!

పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెచ్చిన ఈ వాచ్‌ యాప్‌కు ఏపీ హైకోర్టులో బ్రేక్‌ పడింది. ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన యాప్‌లు అందుబాటులో ఉన్నా.. వాటిని పట్టించుకోని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రైవేటుగా ఈ వాచ్‌ అనే పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చారు. బుధవారం దీన్ని ఆవిష్కరించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వంతోపాటు ఇతరులు మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఈ వాచ్‌ యాప్‌పై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఎవరు తయారు చేశారు..? ఎవరు ఆపరేట్‌ చేస్తారు..? డేటా ఎక్కడ స్టోర్‌ చేస్తారు..? భద్రతాపరమైన సర్టిఫికెట్‌ ఉందా..? వంటి ప్రశ్నలను ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. వీటిపై సరైన సమాధానాలు చెప్పలేకపోయిన ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదులు, భదత్రాపరమైన సర్టిఫికెట్‌ మరో ఐదు రోజుల్లో వస్తుందని తెలిపారు. అప్పటి వరకు ఈ యాప్‌ను వాడొద్దని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

పంచాయతీ ఎన్నికలు తన సొంత వ్యవహారమనేలా వ్యవహరిస్తున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. సొంతంగా యాప్‌ను తెస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని ఉచితంగా తయారు చేయించినట్లు చెప్పడం అనేక అనుమానాలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిఘా యాప్, కేంద్ర ఎన్నికల సంఘం వినియోగించే సివిజిల్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నా.. వాటిని పట్టించుకోని నిమ్మగడ్డ ఈ వాచ్‌ యాప్‌ను తేవడం వెనుక ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికీ దానికి సంబంధించిన సమాచారం బయటకు వెళ్లడి కాలేదు. ప్రైవేటు వ్యక్తులు ఫిర్యాదులు స్వీకరిస్తారని, వాటిని తాము పరిశీలిస్తామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పడంతో అధికార యంత్రాంగ విస్మయం వ్యక్తం చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి భద్రతాపరమైన ధ్రువపత్రం లేకుండా యాప్‌ను నిమ్మగడ్డ ఆవిష్కరించారు. ఈ విషయాన్నే ఏపీ హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది.

ఈ నెల 9వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. ఆ రోజు ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్, ఉప సర్పంచ్‌ ఎన్నిక జరుగుతుంది. ఈ వాచ్‌ యాప్‌పై తదుపరి విచారణ 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేయడంతో తొలి దశ ఎన్నికల నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. పరిశీలన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను అధికారులు గురువారం ప్రకటించారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలోనూ, పోలింగ్‌ రోజున తలెత్తే అవాంఛనీయ, నిబంధనలకు విరుద్ధమైన ఘటనలపై ప్రజలు ఎవరికి..? ఎలా..? ఫిర్యాదు చేయాలనే అంశంపై ఏపీ ఎస్‌ఈసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Read Also : ఈ–వాచ్‌.. ప్రభుత్వంతో పని లేదా..?

Tags  

Related News

రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?

రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?

టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామిక వేత్త అయినటువంటి రతన్ టాటా గురించి తెలియని వ్యక్తి ఉండరేమో. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టాటా కంపెనీ ఉత్పత్తులపై భారతీయులకు ఎనలేని నమ్మకం. ఆ నమ్మకం వెనకాల రతన్ టాటా కృషి మరువలేనిది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షనం రతన్ టాటా సొంతం. కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు అండగా నిలవడంతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి పేదలకు సాయమందించారు రతన్ టాటా. […]

5 hours ago
లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!

లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!

5 hours ago
వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు

వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు

8 hours ago
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..

దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..

9 hours ago
RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!

RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!

9 hours ago

తాజా వార్తలు

  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    9 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    9 hours ago
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    10 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    10 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    11 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    11 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    11 hours ago

సంఘటనలు వార్తలు

  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    11 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    12 hours ago
  • బాబు ఫైబర్ గ్రిడ్ ఛీటింగ్ కి జనమే సాక్ష్యం: జర్నలిస్ట్ సాయి..
    12 hours ago
  • గొప్ప మనస్సు చాటుకున్న రతన్ టాటా.. ప్రశంసల వెల్లువ
    12 hours ago
  • వీడియో: లాంచ్ కి ముందే అనుష్క చేతిలో వన్ ప్లస్ ఓపెన్ ఫోన్!
    12 hours ago
  • వరల్డ్ కప్‌లో సచిన్ సెట్ చేసిన ఆ ఒక్క రికార్డు కొట్టే మగాడు ఎవడు?
    12 hours ago
  • OTTలోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’! స్ట్రీమింగ్ ఎందులో అంటే?
    12 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version