iDreamPost
android-app
ios-app

వీడియో: బ్రావో భారీ సిక్స్‌! స్టేడియం బయటికి బంతి

  • Published Jul 17, 2023 | 2:33 PM Updated Updated Jul 17, 2023 | 2:33 PM
  • Published Jul 17, 2023 | 2:33 PMUpdated Jul 17, 2023 | 2:33 PM
వీడియో: బ్రావో భారీ సిక్స్‌! స్టేడియం బయటికి బంతి

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా, ఐపీఎల్‌లో ఆటగాడిగా తప్పుకుని, కోచ్‌గా సెటిలైనా.. బ్రావోలో ఇంకా దూకుడు తగ్గడం లేదు. వయసు మీదపడుతున్నా.. అది తనకు జస్ట్‌ నంబర్‌ మాత్రమే అన్నట్లు దూసుకుపోతున్నాడు. తాజాగా సిక్స్‌ కొడితే ఏకంగా స్టేడియం బయటపడింది. లేటు వయసులో కూడా బ్రావో ఎలా చెలరేగుతున్నాడో చెప్పడానికి ఇంతకు మించి సాక్ష్యం అవసరం ఉండదేమో. అమెరికా గడ్డపై ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో డ్వేన్‌ బ్రావో సంచలన షాట్‌ ఆడాడు. టోర్నీలోనే అతి భారీ సిక్స్‌తో రికార్డు సృష్టించాడు.

టెక్సాస్ సూపర్ కింగ్స్ టీమ్‌ తరఫున ఆడుతున్న బ్రావో.. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఈ మ్యాచ్‌లో బ్రావో భారీ సిక్స్‌ బాదాడు. ఆ సిక్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ పేసర్, సౌతాఫ్రికా స్టార్ అన్రిచ్ నోర్జే వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను బ్రావో తనదైన పుల్ షాట్‌తో 106 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్‌ మ్యాథ్యూ షార్ట్‌ 80 పరుగులతో రాణించాడు. అయితే 164 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది. బ్రావో మినహా ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో బ్రావో కష్టం వృథా​ అయిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో బ్రావో భారీ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 50 పరుగులకే కుప్పకూలిన నైట్‌ రైడర్స్‌! ఉన్ముక్త్‌ చంద్‌ ఒక్కడే..

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişPadişahbet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel