iDreamPost

ఇది కదా నైతిక బాధ్యత అంటే..!

ఇది కదా నైతిక బాధ్యత అంటే..!

విజయవాడ దుర్గమ్మ దేవాలయం ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలు నాగవరలక్ష్మీ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కారులో మద్యం బాటిళ్లు అక్రమంగా తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విభాగం నిన్న బుధవారం పట్టుకుంది. ఆ సమయంలో ఆమె కారులో లేరు. కారు డ్రైవర్‌ సహా పలువురును పోలీసులు అరెస్‌ చేశారు. కారు తనదేనని ఒప్పుకున్న నాగవరలక్ష్మీ.. డీజిల్‌ నింపేందుకని కారు తీసుకెళ్లినడ్రైవర్‌ ఇలాంటి పని చేస్తాడని ఊహించలేకపోయానని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో ఆమె పాత్ర లేకపోయినా కారు తనది కావడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామాను చైర్మన్‌ పైలా స్వామినాయుడుకు సమర్పించింది. ఆమె రాజీనామాను స్వామినాయుడు ఆమోదించారు.

ఈ వ్యవహారంలో నాగవరలక్ష్మీ ప్రమేయం లేకపోయినా.. తప్పు జరిగింది కాబట్టి ఆమె నైతక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మాత్రం ఈ వ్యవహారాన్ని సీఎం జగన్‌కు, దుర్గగుడి పాలక మండలికి, దేవాదాయ శాఖ మంత్రికి ఆపాదిస్తూ అర్థరహితంగా విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన జగన్‌ దోపిడీ విధానానికి అద్దం పడుతోందని కళా వెంకటరావు విమర్శించారు. వెంటనే పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని కూడా టీడీపీ రాష్ట అధ్యక్షుడు డిమాండ్‌ చేస్తున్నారు.

కళా వెంకటరావు ఇలాంటి డిమాండ్లు చేయడంలో ఆశ్చర్యం లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన విధి కూడా. అయితే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నాగవరలక్ష్మీ పాలక మండలి నుంచి తప్పుకున్నారు. అయినా కళా వెంకటరావు మంత్రి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాత్రిక పూజలు నిర్వహించారు. ఈ దృష్యాలు సీసీ టీవీ కెమెరాల్లో కూడా నిక్షిప్తమయ్యాయి.

ఈ పూజలు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల నుంచి, భక్తులు, ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో ఈవోను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు గానీ పాలక మండలిగానీ, టీడీపీ నేతలను బాధ్యులను చేయలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని నాటి ఘటనను వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వంలో దేవాలయానికి సంబంధంలేని ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ పాలక మండలి సభ్యురాలు రాజీనామా చేశారని పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి