iDreamPost
android-app
ios-app

OTT Movie: OTTని దున్నేస్తున్న హారర్ మూవీ! మనిషికి, అతీంద్రియశక్తుల మధ్య యుద్ధం!

  • Published Apr 19, 2024 | 9:40 PM Updated Updated Apr 26, 2024 | 6:21 PM

హర్రర్ మూవీస్ అంటే ఈ మధ్య అందరికి ఆశక్తి బాగా పెరుగుతుంది. భయం ఉన్నా సరే.. వీటిని ఎలాగైనా చూస్తుంటారు ప్రేక్షకులు.. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ సినిమా.. మీరు మిస్ చేసినట్లయితే వెంటనే చూసేయండి.

హర్రర్ మూవీస్ అంటే ఈ మధ్య అందరికి ఆశక్తి బాగా పెరుగుతుంది. భయం ఉన్నా సరే.. వీటిని ఎలాగైనా చూస్తుంటారు ప్రేక్షకులు.. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ సినిమా.. మీరు మిస్ చేసినట్లయితే వెంటనే చూసేయండి.

  • Published Apr 19, 2024 | 9:40 PMUpdated Apr 26, 2024 | 6:21 PM
OTT Movie: OTTని దున్నేస్తున్న హారర్ మూవీ! మనిషికి, అతీంద్రియశక్తుల మధ్య యుద్ధం!

అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అదంతా మన ఇమాజినేషన్ ఏ నా.. ఏమో దీనికి ఆన్సర్ అయితే ఎవరు చెప్పలేరు కానీ.. దెయ్యాలు సంబంధించిన సినిమాలు, సిరీస్ లు వస్తే మాత్రం అందరూ ఎంచక్కా చూస్తూ థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు. థియేటర్ లో హర్రర్ సినిమాలు చూసేవారు ఒక రకం అయితే.. ఒంటరిగా కూర్చుని ఓటీటీ లలో హర్రర్ సినిమాలు చూసే వారు మరొక రకం. మరికొంతమందైతే ఎంత భయపడుతున్నా సరే.. హర్రర్ సినిమాలను చూడడం మాత్రం మానరు. ఇప్పటివరకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చిన హర్రర్ సినిమాలన్నిటికీ మంచి ఆదరణ లభించాయి. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం ఒక మంచి తెలుగు హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో.. చూసేద్దాం.

ఈ హర్రర్ పేరు “తంతిరం”. ఇది ఒక తెలుగు మూవీ.. 2023 లో థియేటర్ లో రిలీజ్ అయింది. థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపొయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హర్రర్ మూవీస్ అంటే అందరికి ఇష్టమే. కానీ ఈ సినిమా గురించి వింటే మాత్రం.. అసలు కదలకుండా చూడాలనిపిస్తుంది. పైగా ఈ సినిమాకు పార్ట్ -2 కూడా ఉందట. అంటే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కూడా.. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. అదీబన్ అనే వ్యక్తి ఒక ఊరిలో ఒక క్రాకర్స్ ఫ్యాక్టరీని నడుపుతూ ఉంటాడు. అతనికి ఒక భార్య కుమారుడు ఉంటారు. అయితే కొంతకాలానికి అతని భార్య ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీనితో అతను తన కుమారుడికి.. ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటాడు. అలాగే అతని కుమారుడికి ఒక అలాగిని అనే.. యువతితో పెళ్ళి జరిపిస్తాడు. అసలు కథ అప్పుడు స్టార్ట్ అవుతుంది.

పెళ్ళైన కొంతకాలం వరకు వారిద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్యలోకి ఒక అతీత శక్తి ప్రవేస్తుంది. మూవీలో ఆ తెలియని శక్తిని జిన్ అనే క్యారక్టర్ గా చూపించారు. అసలు ఈ జిన్ ఎవరు ! ఈ దెయ్యం వారి మధ్య ప్రవేశించిన తర్వాత వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి! ఆ జిన్ అనే దెయ్యం వారినే ఎందుకు వేధించడం మొదలు పెట్టింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్షణ క్షణం తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కలిగిస్తూ.. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు కదలకుండా కూర్చుని చూసే సినిమా ఇది. ఇప్పటివరకు ఈ సినిమాను కనుక మిస్ అయితే.. వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş