iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: ఆ ఇంటి బేస్మెంట్ లో 13 దెయ్యాలు.. OTT లో ఈ హర్రర్ మూవీ వణుకు పుట్టిస్తుంది.

  • Published May 07, 2024 | 1:42 PM Updated Updated May 07, 2024 | 1:42 PM

హర్రర్ సినిమాలంటే అందరు ఊపిరి బిగపట్టి మరి చూస్తుంటారు. అయితే చాలా వరకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నిటికి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. కానీ, యూట్యూబ్ లో ఉన్న ఈ హర్రర్ సినిమాను మీరు మిస్ అయ్యి ఉంటే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ అయినట్లే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

హర్రర్ సినిమాలంటే అందరు ఊపిరి బిగపట్టి మరి చూస్తుంటారు. అయితే చాలా వరకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నిటికి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. కానీ, యూట్యూబ్ లో ఉన్న ఈ హర్రర్ సినిమాను మీరు మిస్ అయ్యి ఉంటే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ అయినట్లే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 07, 2024 | 1:42 PMUpdated May 07, 2024 | 1:42 PM
OTT Movie Suggestion: ఆ ఇంటి బేస్మెంట్ లో 13 దెయ్యాలు.. OTT లో ఈ హర్రర్ మూవీ వణుకు పుట్టిస్తుంది.

హర్రర్ సినిమాలంటే చాలు ఈ మధ్య చిన్నా పెద్దా తేడా లేకుండా చూసేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. ఇలాంటి ఓ హర్రర్ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. పైగా ఈ హర్రర్ సినిమా ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ గా చూసేయొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తో పాటు.. యూట్యూబ్ లోను అందుబాటులో ఉంది. హర్రర్ సినిమాలంటే బాగా భయం ఉన్న వాళ్లకు ఈ సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో.. భయపడేవాళ్ళకు అంత కంటే ఎక్కువ భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏ హర్రర్ సినిమాలో అయినా ఒకటి రెండు దెయ్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏకంగా 13 దెయ్యాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం..

ఈ సినిమా పేరు “13 ఘోష్ట్స్”. సినిమా పేరును బట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమాలో మొత్తం 13 దెయ్యాలు ఉండబోతున్నాయి అని.. సాధారణంగా అన్ని హర్రర్ సినిమాలలో ఎవరిలో దెయ్యం ఉందొ కనిపెట్టి వారి నుంచి దెయ్యాన్ని ఎలాగూ ఒకలా బయటకు పంపించే ప్రయత్నాల్లాంటివి చేస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఈ సినిమా కూడా అలాంటిదే కానీ చాలా డిఫరెంట్. ఈ సినిమా 2001 లో విడుదలైంది. హర్రర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోను, యూట్యూబ్ లోను అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాను ఎందుకు మిస్ చేయకుండా చూడాలి.. అసలు ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం..

ఈ సినిమాలో సైరస్ అనే వ్యక్తి.. ఓ ఘోస్ట్ హంటర్.. తను 13 దెయ్యాలను కలిపి ఓ ప్రయోగం చేయాలనీ అనుకుంటాడు. అందుకోసం 12 దెయ్యాలను బంధిస్తాడు. కానీ.. 13 వ దెయ్యాన్ని బంధించే క్రమంలో అతను మరణిస్తాడు. అయితే అతను చనిపోయే ముందు తన ఇంటిని.. తన బంధువులలో ఒకరైన ఆర్థర్ అనే వ్యక్తికీ చెందాలని విల్లు రాస్తాడు. అప్పటివరకు చాలా పేదరికంలో ఉండి కష్టాలు పడుతున్న వ్యక్తికీ.. ఇప్పుడు ఇల్లు రావడంతో.. అదృష్టంగా భావించి తన కుటుంబంతో సహా ఆ ఇంటికి వెళ్తాడు. కానీ అసలు కథ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి అసిస్టెంట్ ఆ ఇంటికి వచ్చి.. ఆ 12 దెయ్యాలు ఆ ఇంటి బేస్మెంట్ లో ఉన్నాయని గుర్తించి .. ఆర్థర్ కు చెప్తాడు. ఆ దెయ్యాల వలన ఆర్ధర్ కు ఎలాంటి హాని సంభవిస్తుంది! తానూ బంధించాలి అనుకున్న 13 దెయ్యం ఎక్కడ ఉంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alBetraBetraBetrakatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş