iDreamPost
android-app
ios-app

OTT Releases : ఈ వారం OTT లోకి రాబోయే ఈ 3 సినిమాలను అస్సలు మిస్ కాకండి.. అవేంటంటే!

  • Published May 21, 2024 | 12:06 PM Updated Updated May 21, 2024 | 12:06 PM

ప్రతి వారం చాలానే సినిమాలు ఓటీటీ లోకి వస్తూనే ఉన్నాయి. అలానే ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిపోయాయి. మరి వాటిలో అసలు మిస్ కాకుండా చూడదగిన సినిమాలేంటో చూసేద్దాం.

ప్రతి వారం చాలానే సినిమాలు ఓటీటీ లోకి వస్తూనే ఉన్నాయి. అలానే ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిపోయాయి. మరి వాటిలో అసలు మిస్ కాకుండా చూడదగిన సినిమాలేంటో చూసేద్దాం.

  • Published May 21, 2024 | 12:06 PMUpdated May 21, 2024 | 12:06 PM
OTT Releases : ఈ వారం OTT లోకి రాబోయే ఈ 3 సినిమాలను అస్సలు మిస్ కాకండి.. అవేంటంటే!

ప్రతి వారం చాలానే సినిమాలు ఓటీటీ లోకి వస్తున్నా కూడా.. వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. పైగా ఆ సినిమాలే ఓటీటీ లో బెస్ట్ గా నిలుస్తాయి. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో రాగా… వాటిలో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు మాత్రం కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి. పైగా థియేటర్ లో హిట్ కానీ సినిమాలు సైతం ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ తో ట్రేండింగ్ తో దూసుకుపోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలలో చూడదగిన సినిమాలేంటో .. అవి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం రాబోయే సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీ లోకి అడుగు పెట్టడం విశేషం. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

ప్రసన్నవదనం:

సుహాస్ నటించిన ప్రసన్నవదనం సినిమా..థియేటర్ లో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా గడవకముందే… ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా ఇంత త్వరగా ఓటీటీ లోకి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. మే 3 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా.. మే 24 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. థియేటర్ లో డీసెంట్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా మరి ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా మే 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ కానుంది.

Prasanna Vadanam

రత్నం:

విశాల్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 26 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్ లో మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. డీసెంట్ కలెక్షన్స్ తో థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీగా ఉంది. థియేటర్ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. రత్నం సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Ratnam

క్రూ:

కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ తో పాటు సీనియర్ నటి టబు నటించిన చిత్రం క్రూ. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో పాటు భారీ స్పందన కూడా లభించింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమా మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Crew

కాబట్టి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే ఈ మూడు సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişJojobet GirişCasibomcasibom girişholiganbettaraftarium24madridbet girişmadridbet girişmadridbetJojobet GirişkatlaJojobet Giriş