iDreamPost

OTT Suggestion: OTTలో జగపతిబాబు సినిమా! ఆడాళ్ళపై మోజుతో ఇంత దారుణంగానా?

  • Published Apr 24, 2024 | 7:50 PMUpdated Apr 26, 2024 | 6:16 PM

ఓటీటీ లో ఇప్పుడు అన్ని మంచి సినిమాలే వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కొంతకాలం కిందట వచ్చిన కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను ఎవరైన మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో ఇప్పుడు అన్ని మంచి సినిమాలే వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కొంతకాలం కిందట వచ్చిన కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను ఎవరైన మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Apr 24, 2024 | 7:50 PMUpdated Apr 26, 2024 | 6:16 PM
OTT Suggestion: OTTలో  జగపతిబాబు సినిమా!  ఆడాళ్ళపై మోజుతో ఇంత దారుణంగానా?

ఈ మధ్య కాలంలో ఓటీటీ లోకి వచ్చే సినిమాలన్నీ కూడా వారం పది రోజుల నుంచి.. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూ ఉంటున్నాయి. దీనితో మూవీ లవర్స్ ఎవరు కూడా ఈ సినిమాలను మిస్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ, ఒకప్పుడు ఏ సినిమాలు ఏ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉన్నాయనే విషయం తెలుసుకోవాలంటే.. కాస్త కష్టమైన పని. దీనితో చాలా వరకు ఓటీటీ లో ఉండే కొన్ని పాత సినిమాలను మిస్ చేసి ఉంటారు. కానీ నిజానికి ఆ సినిమాలన్నీ కూడా వర్త్ వాచింగ్ మూవీస్ అని చెప్పి తీరాలి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటె మాత్రం వెంటనే చూసేయండి. అసలు ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. “రుద్రంగి”. ఇది ఒక తెలుగు సినిమా.. 2023 లో విడుదలైంది. కాగా ఈ సినిమాలో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించగా.. ఆయనతో పాటు.. విమలారామన్‌, మమతా మోహన్‌ దాస్‌, గానవి లక్ష్మణ్‌, ఆశిష్ గాంధీ లాంటి వారు కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను తెలంగాణ దొరల నేపథ్యంలో.. కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందించారు. థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో ఓ మోస్తరు కలెక్షన్స్ ను సంపాదించి.. ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చింది. ఒకప్పుడు దొరలు ప్రజలను ఏ విధంగా పాలించే వారు అనే కథాంశంతో.. అప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలని ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. ఈ సినిమాలో భీమ్‌రామ్‌ దేశ్‌ముఖ్‌ అనే దొర పాత్రలో జగపతిబాబు నటించాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉంటారు.. మీరాబాయి, జ్వాలాబాయి . ఆ దొరకు ఆడవాళ్లంటే బాగా మోజు. ఈ క్రమంలో రుద్రంగి అనే అమ్మాయిపై ఈ దొర కన్ను పడుతుంది. ఆమెను సొంతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే మల్లేష్ అనే వ్యక్తి దొరకు ఎదురుతిరుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ! దొరలు ప్రజలను ఏ రకమైన బానిసత్వానికి గురి చేశారు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి