iDreamPost

మహా శివరాత్రి‌నాడు ఈ పొరపాట్లు చేయకండి!

Maha Shivratri Festival: దేశ వ్యాప్తంగా రేపు మహా శివరాత్రి పర్వదినం ఘనంగా జరుపుకుంటారు. హర హర మహాదేవ.. శంభోం శంకరా.. అంటూ మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తుల శివనాస్మరణతో మార్మోగుతాయి.

Maha Shivratri Festival: దేశ వ్యాప్తంగా రేపు మహా శివరాత్రి పర్వదినం ఘనంగా జరుపుకుంటారు. హర హర మహాదేవ.. శంభోం శంకరా.. అంటూ మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తుల శివనాస్మరణతో మార్మోగుతాయి.

మహా శివరాత్రి‌నాడు ఈ పొరపాట్లు చేయకండి!

భారత దేశంలో హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8న వచ్చింది. మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. ఈ రోజు ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమశివుడు ప్రసన్నం అవుతారని భక్తుల నమ్మకం. అందుకే శివరాత్రి రోజు నిష్టతో పూజలు చేస్తూ దైవ చింతనలో మునిగిపోతుంటారు. శివరాత్రి రోజు భక్తులు శివ నామాన్ని, మంత్రాలను మనస్ఫూర్తిగా పఠిస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతులు భూలోకానికి వస్తారని.. ఈ రోజు మహాశివుడిని నిర్మలమైన మనసుతో పూజిస్తే వారి పాపాలను తొలగిస్తారని భక్తుల నమ్మకం. భక్తులు తెలిసీ తెలియక చేసే తప్పిదాల వల్ల పుణ్యం దక్కదు. శివరాత్రి రోజున పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

శివుడు అభిషేక ప్రియుడన్న విషయం తెలిసిందే. అందుకే శివరాత్రి రోజు చాలా మంది భక్తులు లింగాభిషేకం చేస్తుంటారు. కొంతమంది నేరుగా పాల ప్యాకెట్లతోనే శివలింగానికి అభిషేకం చేస్తారు. అలా చేయవొద్దని పండితులు చెబుతున్నారు. రాగి కలశాన్ని కూడా ఉపయోగించకూడదు. మట్టి పాత్ర కానీ.. స్టీల్ పాత్రల్లో పాలను తీసుకొని అభిషేకం చేస్తే పుణ్యఫలం దక్కుతుంది. పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కర వంటి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత నీళ్లతో అభిషేకం చేయాలి.. అప్పుడు మంచి ఫలితం దక్కుతుంది. అభిషేకానికి శంఖాన్ని వాడకూడదు.

శివరాత్రి రోజు మహాశివుడిని బిల్లపత్రాలతో పూజిస్తారు.. తులసీ దళాలతో అస్సలు పూజించకూడదు. బిల్వ పత్రాలు, శమీ పత్రాలను ఉపయోగించి పూజలు చేయవొచ్చు. అయితే ఆ ఆకుల తొడిమె మొదటి భాగాన్ని తీసి శివలింగానికి సమర్పించాలని పండితులు చెబుతున్నారు. గోగుపూలతో సేవ చేయడం ఎంతో శుభప్రదం అంటున్నారు. అభిషేకం తర్వాత స్వామి వారికి విభూది సమర్పించాలి. శివరాత్రి మాత్రమే కాదు.. శివపూజకు ఎప్పుడూ కుంకుమ సమర్పించకూడదు… అది నిషిద్దం. అందుకు శివాలయాల్లో చాలా వరకు విభూది ఉంటుంది.. కుంకుమ కనిపించదు అన్ని విషయం తెలిసిందే. ప్రదక్షణలు పూర్తిగా చేయవొద్దు.. ఏ నైవేద్యం చేసినా శివుడికి సమర్పించిన తర్వాత అందరికీ పంచాల్సి ఉంటుంది.

స్వామి వారికి పాలను మాత్రమే నైవేద్యంగా ఇవ్వకూడదని పండితులు అంటున్నారు. లింగం చుట్టూ ప్రదక్షణలు పూర్తిగా చేయకూడదు.. దీని వల్ల ప్రతిఫలం దక్కదు. రాత్రి నక్షత్ర దర్శనం తర్వాతే ఉపవాసం వదలాలి. ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండాలనే నియమం లేదు. ఉపవాసం మధ్యలో పాలు, పండ్లు తీసుకోవచ్చు. మాంసం, మధ్యం లాంటివి తీసుకోవొద్దు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవొద్దు, దుర్భషలాడకూడదు. ఎప్పుడూ మనసులో ఓం నమఃవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. నియమ నిష్టలతో శివరాత్రి చేస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి