iDreamPost

10 రోజుల్లో పెళ్లి.. చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శునకం

10 రోజుల్లో పెళ్లి.. చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శునకం

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత కోరుకుంటుంది. ఆ విధంగానే ఎందరో యువత..తమ పెళ్లిని ఘనంగా నిర్వహించుకుంటాయి. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం పీటల మీదనే ఆగిపోతుంటాయి. సినిమాల్లో అయితే ఏకంగా తాళికట్టే క్షణం ముందుక ఆపండి  అని ఓ వాయిస్ వచ్చి.. పెళ్లి ఆగిపోతుంది. ఇవ్వన్ని రకరకాల కారణాల వల్ల జరుగుతాయి. కానీ తాజాగా ఓ పెళ్లి విషయంలో మాత్రం కుక్కు కారణంగా మారింది. ఇప్పుడు ఈ పెంపుడు శునకం కారణంగా పెళ్లి రద్దు అయ్యే పరిస్థితి తలెత్తింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికాకు చెందిన డొనాటో ఫ్రాట్టరోలిస్ అనే యువకుడి మాగ్దా మజ్రీస్ అనే యువతితో వివాహం నిశ్చమైంది. తమ పెళ్లిని గ్రాండ్ నిర్వహించుకోవాలని కాబోయే వధువరులు నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పెళ్లిని ఇటలీలో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అక్కడ పెళ్లి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఇరు కుటుంబాల తరఫున పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులకు పాస్‌పోర్టులు, వీసాలు, టికెట్లు అన్నీ సిద్ధం చేశారు.

పెళ్లికి మరో 10 రోజులు ఉందనగా ఒక రోజు వరుడు.. కొన్ని పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. అదే ఆ సమంయలో డొనాట్ ఫ్రాట్టరోలిస్‌ పెంచుకుంటున్న శునకాన్ని ఇంట్లోనే ఉంది. ఇంట్లోని బల్ల మీద పెట్టిన అతడి పాస్‌పోర్టును ఆ కుక్క నమిలి తినేసింది. బయటకు వెళ్లిన డొనాట్ ఫ్రాట్టరోలిస్‌, అతని కుటుంబ సభ్యులు.. ఇంటి వచ్చి.. ముక్కలుగా పడి ఉన్న పాస్ పోర్టును చూసి షాకయ్యారు. మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకున సమయంలో ఇలా జరగడంతో ఏం చేయాలో అర్థం కాక కంగుతిన్నాడు. పెళ్లికి ఎక్కువ సమయం లేకపోవడంతో వెంటనే పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లి జరిగిన విషయం అధికారులకు వివరించాడు.

తనకు పెళ్లి నిశ్చయమైందని.. ఆగస్టు 31 వ తేదీన ఇటలీలో జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు అధికారులకు తెలిపాడు. తనకు ఏదో విధంగా సహాయం చేయాలని వారిని వేడుకున్నాడు. తన పాస్‌పోర్టు సమస్యను వీలైనంత తొందరగా పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనిపై డొనాట్ ఫ్రాట్టరోలిస్‌ సమస్యపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు, లించ్‌, మార్కీ పాస్‌పోర్టు ఆఫీసులు స్పందించాయి. త్వరలోనే  డొనాట్ కు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాయి. చూశారా.. అప్పుడప్పుడు కుక్కల వల్ల కూడా పెళ్లిళ్లు ఆగిపోయే పరిస్థితి వస్తుంటాయి. మరి.. ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  వారంలో పెళ్లి అనగా.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి