iDreamPost

హవ్వ – కరెంటు బిల్లులపై తెలుగుదేశం పార్టీ దీక్షా ?

హవ్వ – కరెంటు బిల్లులపై తెలుగుదేశం పార్టీ దీక్షా ?

తెలుగుదేశం పార్టీ నిన్నటి రోజున రాష్ట్రంలో అక్కడక్కడా కొంతమంది నాయకులుతో నిర్వహించిన కరెంటు దర్నా చూస్తుంటే వీరు ప్రజల జ్ఞాపక శక్తి మీద ఎంత చులకన భావంతో ఉన్నారో అర్ధం అవుతుంది. వారికి ఉన్న సామాజిక మాద్యమాల అండతో ప్రజల్లో చిన్న పాటి అపోహలు రేపి , వాటిని వారి మీడియా చానల్స్ ద్వారా పెద్దది చేసి ఆ తరువాత ఆ అంశం ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతగా చిత్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం వారు ఆనవాయతీగా చేసుకుంటూ వస్తున్న రాజకీయ ఎత్తుగడ . ఇందులో భాగంగానే మొదట ఇసుక కొరత అంటూ , తరువాత ఉల్లి కొరత అంటూ అనేక వాటిపై ప్రజల్లో అపోహలు కలిగించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని తమ ప్రధాన ఎజండాగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా వారు కొత్తగా సామాజిక మాద్యమాల ద్వారా పుట్టించిన మరో అపోహా కరెంటు చార్జీలు జగన్ పెంచారు అని.

లాక్ డౌన్ సమయంలో జగన్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కరెంటు బిల్లులు పెంచి సామాన్యులపై బారం మోపారని, దాని పర్యావసానమే నేడు సామాన్యులకు అధిక చార్జీలతో కూడిన బిల్లులు వస్తున్నయి అంటు కరెంటు చార్జీలపై ఏకంగా దీక్షకు దిగారు , చంద్రబాబు నేడు కరెంటు చార్జీలపై చేస్తున్న దీక్షలు , మాట్లాడుతున్న మాటలు చూస్తే చంద్రబాబుకు కరెంటు బిల్లులు ప్రజలకు భారం అనే మాట ఎప్పుడు గుర్తుకు వచ్చింది అనే ప్రశ్న ఆయన హయంలో బిల్లు కట్టలేక జైలు కి వెళ్ళిన రైతులకి కలగక మానదు. నిజానికి విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం ఎల్లో మీడియా సోషల్ మీడియా అండతో దుష్ప్రచారం చేస్తుందని, తాము లాక్ డౌన్ సమయంలో చార్జీలు పెంచలేదని. రెండు లేదా మూడు ఏసీలను వినియోగించే వినియోగదారులకే సుమారు 500 యూనిట్లు కర్చు అయ్యే అవకాశం ఉందని అలాంటి వారికి మాత్రమే గతంలో పెంచామని , 200 యూనిట్లు లోపు వాడేవారికి దేశంలో తక్కువ ధరకు విద్యుత్‌ అందిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమేనని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.

ప్రభుత్వం ఒక పక్క వివరణ ఇచ్చిన తరువాత కూడా దీక్షలు దర్నాలు అంటు ప్రభుత్వం పై దాడి చేస్తున్న తెలుగుదేశం పార్టికి నిజంగా విద్యుత్ చార్జీలపై , ప్రజలపై ఇంత అక్కర ఉందా అని చూస్తే దానికి సమాధానం వారి పాలనలో కనిపిస్తుంది. ఎన్.టి రామారావును గద్దె దింపి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మొదటి 5ఏళ్లలోనే కరెంటు చార్జీలు నాలుగు సార్లు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరగగొట్టారు.1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన నాటికి యూనిట్ చార్జీ 50పైసలు నుండి 1.60 పైసలు వరకు ఉంటే 2000 సంవత్సరం వచ్చే సరికి దానిని రూ 1.40 పైసల నుండి రూ 7.05 పైసలకు పెంచారు. కేవలం ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్ళలోనే కరెంటు చార్జీలు 3% పెంచి పేదవారికి షాక్ కొట్టేలా చేశారు. 1995లో హార్స్ పవర్ 50 రూపాయలు ఉంటే దానిని అమాంతం 600కు పెంచి రైతులకి కన్నీరు తెప్పించారు.

కరెంటు చార్జీలు పెంచి పేద వర్గాలను రైతులను ఇబ్బంది పెట్టింది చాలదన్నట్టు దొంగ కరెంటు వాడారు అని 3 హెచ్.పి కి అనుమతి తీసుకుని 5 హెచ్.పి మోటర్ వాడుతున్నారు అని సాకులు చెబుతూ మొత్తం వ్యవసాయానికి సంబందించిన రైతుల మీద చంద్రబాబు హయం లో 11వేల కేసులు పెట్టారు. కరంటు బిల్లు కటలేదు అని 77 వేల మంది రైతుల మీద క్రిమినల్ కేసులు బుక్ చేశారు, ఇలా రైతుల మీద కేసులు బుక్ చెయడానికి అధికారులకు చంద్రబాబు టార్గెట్లు కూడా ఇవ్వడం గమనార్హం . ఒక సారి బాబు ఇచ్చిన టార్గెట్ వివరాలు చూస్తే – ఏ.ఈ లెవల్ కి – 20 కేసులు – ఏ.డి.ఈ లెవల్ కి 45 కేసులు, డిపార్ట్మెంట్ ఆగ్ పిల్ఫిరేజ్ ఆఫ్ ఎనర్జి కింది – ఏ.ఈ లెవల్ కి – 20 కేసులు – ఏ.డి.ఈ లెవల్ కి 45 కేసులు ఇలా అధికారులకి టార్గెట్లు ఇచ్చి మరీ అధిక ధరల తో కూడిన కరెంటు చార్జీలను కట్టలేని రైతులని జైలులో పెట్టించారు. చివరికి ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడి కరెంటు చార్జీల పై ఉద్యమం చెస్తే బషీర్ భాగ్ లో 2000వ సంవత్సరం ఆగస్టు నెలలో ప్రజల పై పోలీసుల చెత కాల్పులు జరిపించి ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో చనిపొయిన వారి మీద ఏ మాత్రం జాలి లేకుండా కాల్పులు జరిపిన పోలీసులని పరామర్శించి వచ్చారు చంద్రబాబు. ఆ తరువాత 2014 లో గెలిచిన తరువాత కూడా రెండు సార్లు కరెంటు చార్జీలు పెంచారు చంద్రబాబు.

కరెంటు బిల్లులపై ఇంత ఘనమైన చరిత్ర పెట్టుకున్న తెలుగుదేశం పార్టి, నేటి ప్రభుత్వం పై కరెంటు బిల్లులు పెంచారు అనే నింద వేస్తు దీక్షలు చేయడం ఒట్టి రాజకీయ డ్రామా గా మాత్రమే కనిపిస్తుంది. గతంలో విధ్యుత్ చార్జీల పై తాము ఎలా వ్యవహరించారో , ప్రజలను పోలీసు తూటాలకు బలిచ్చి ఎలా పొట్టన పెట్టుకున్నారో ప్రజలు పూర్తిగా మర్చిపోయి ఉంటారనే అపారమైన నమ్మకంతో నేడు చేస్తున్న దీక్షలు ఒకింత ఆశ్చర్యానికి గురిచేయక మానదు. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న విధ్యుత్ అధికారులు సైతం బాబు రాజకీయం చూసి బాబు గత పాలనలో చేసిన పనులు జ్ఞప్తికి తెచ్చుకుని విస్మయం చెందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి