iDreamPost

నేడు పత్రికా స్వేచ్చ దినోత్సవం – స్వేచ్చ ముసుగులో పత్రికలు గీత దాటుతున్నాయా?

నేడు పత్రికా స్వేచ్చ దినోత్సవం – స్వేచ్చ ముసుగులో పత్రికలు గీత దాటుతున్నాయా?

1993 నుండి ప్రతి సంవత్సరం మే 3వ తారీఖున పత్రికా స్వేచ్చ కోసం త్యాగాలు చేసిన జర్నలిస్టులను స్మరించుకుంటు యునిస్కో సభ తీర్మానం మేరకు పత్రికా స్వేచ్చ దినోత్సవం జరుపుకుంటున్నాము. నిజానికి భారత రాజ్యంగంలో పత్రికా స్వేచ్ఛకు సంభందించి ప్రత్యకమైన పదం ఏమీ లేకపోయినా , ఆర్టికల్ 19(1)ఏ ప్రకారం ప్రతి పౌరుడికి ఉండే భావ ప్రకటనా స్వేచలో భాగంగానే పత్రికా స్వేచ్చను పరిగణిస్తున్నారు. కానీ పత్రికా స్వేచ్చకు మన పత్రికలు నిజంగా అర్హమైనవేనా అనే ఆలోచన ఇటీవల ప్రతి ఒక్కరిలో మొదలైంది . దీనికి కారణం కూడా పత్రికల విపరీత ప్రవర్తనే అని చెప్పడంలో సందేహం లేదు.

ఏ దేశ రాజ్యాంగంలోనైనా ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి, ఆ దేశాన్ని అభివృద్ది పధంలో నడిపించడానికి, ప్రజాస్వామ్యాని పరిరక్షించడానికి ప్రభుత్వం, పార్లమెంట్ , న్యాయ వ్యవస్థ అనే మూడు విభాగాలు ఉంటాయి. కానీ ఈ మూడు విభాగాలను ప్రభావితం చేయగలిగిన శక్తి ఒక్క పత్రికా రంగానికి మాత్రమే ఉంటుంది. అటువంటి పత్రికా రంగం గాడితప్పితే , కొంతమంది అవకాశ వాదుల స్వార్ధ ప్రయోజనాలు తీర్చే యంత్రాలుగా మారితే, ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే ఈ వ్యవస్తే సమాజాన్ని కూల్చే క్షిపణి అయితే ఆ ప్రమాదం ఊహకు కూడా అందదు. ప్రజలను అభ్యుదయం వైపు నడ్పించాల్సిన పత్రికా రంగం నిజానికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎంత పక్షపాత దోరణితో వ్యవహరిస్తుందో వేరే చెప్పకరలేదు.

ఎక్కడైతే కాపిటలిస్టులు ఉంటారో అక్కడ పత్రికా స్వేచ్చా అంటే – పత్రికా యాజమాన్యులని కొనడం , సంపాదకీయాలు రాసే జర్నలిస్టులకి లంచాలు ఇచ్చి భూర్జువాలకు అనుకూలంగా ప్రజానాడిని చూపించడం జరుగుతుంది అని విప్లవ నేత లెనిన్ చెప్పిన విదంగానే మన రాష్ట్రంలో కూడా పత్రికలు వాటి యాజమాన్యాలు ఒక వర్గానికి కొమ్ముకాస్తు, ప్రజలని తప్పుదోవ పట్టిస్తు వారి వ్యతిరేకుల పై తప్పుడు వార్తలను పుంఖానుపుంకాలుగా పుట్టిస్తు ఉన్నాయి. స్వేచ్చ పేరున వాస్తవాలను ఉద్దేశ పూర్వకంగా వక్రీకరిస్తూ ప్రజా స్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నాయి. స్వేచ్చ ముసుగులో వ్యక్తిగత దూషణలకు దిగుతు గుడ్డకాల్చి మొహాన్న వేస్తాం , బురద జల్లుతాం మీరు తుడుచుకోవాలి అంటు పత్రికా స్వేచ్చ అనే పేరుకే అర్ధాన్ని మార్చేశాయి.

చూట్టు ఉన్న చీకటిని చీల్చే చీరుదీపమే పత్రికలు అని అనుకునే రోజు నుంచి వెలుగు కాంతులతో విరాజిల్లుతున్న సమాజాన్ని గాడాంధకారం వైపు నెట్టివేయబడే సాదనంగా ఈ పత్రికలు తయారయ్యాయి. పత్రికలు లేని సమాజం ఊహించడం కష్టం అని అనుకునే రోజు నుంచి ఆంద్ర రాష్ట్రంలో ఉన్న కొన్ని పత్రికా సంస్థలు ఉంటే సమాజానికే ప్రమాధకరం అనే భావనలోకి ప్రజలు వస్తున్నారు అంటే రాష్ట్రంలో పత్రికలు ఎంత పక్షపాత దోరణితో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. జర్నలిజం విలువలకు కట్టుబడి ప్రాణాలు సైతం పొగొట్టుకున్న గణేష్ శంకర విధ్యార్ధి లాంటి మహోన్నతుల అడుగుజాడల్లో పత్రికా రంగం నడవకపోగా గోబెల్స్ ఫ్యాక్టరీలుగా తయారయి ప్రజలను మరిoత పీడించే సాధనాలుగా తయారయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో స్వేచ్చ కావల్సింది తప్పుడు వార్తలు రాసే పత్రికలకా లేక వాటిని చదివి మరింత అంధకారంలోకి వెల్తున్న ప్రజలకా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి