iDreamPost

కేసియార్ దెబ్బకు మీడియా సైలెంట్

కేసియార్ దెబ్బకు  మీడియా సైలెంట్

తెలంగాణా కేసియార్ దెబ్బంటే ఇలాగే ఉంటుంది. చెప్పదలచుకున్న విషయాన్ని, చేయదలచుకున్న పనిని నిర్భయంగా చేసేస్తారనే విషయం మరోసారి రుజువైంది. సోమవారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో అదే విషయం మరోసారి తేలిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపధ్యంలో కొన్ని పత్రికల్లో వ్యతిరేక వార్తలు, కథనాలు వచ్చిన విషయమై కేసియార్ మండిపోయారు. గాంధి ఆసుపత్రిలో రోగులపై జరిగిన దాడి విషయంపై ఓ సెక్షన్ మీడియాలో వార్తలొచ్చాయి. అంటే డాక్టర్లకే రక్షణ లేదంటూ కథనాలు వచ్చాయి. అలాగే అక్కడక్కడ చిన్న లోపాలను కూడా హైలైట్ చేశాయి.

ఇదే విషయమై కేసియార్ మాట్లాడుతూ డాక్టర్లకు రక్షణ ప్రభుత్వం ఇవ్వకపోతే మీడియా ఇస్తుందా లేకపోతే చవకబారు వార్తలు రాసిన మీడియా ఇస్తుందా అంటూ నిలదీశారు. ప్రభుత్వంపై మీడియా రాస్తున్న వార్తలను వెకిలిరాతలు, పిచ్చిరాతలుగా అభివర్ణించారు. ప్రభుత్వం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నపుడు ప్రతి ఒక్కళ్ళు భుజం కలిపి సాయం చేయాలే కానీ పనికిమాలిన రాతలు రాసినందు వల్ల ఉపయోగం ఉండదన్నారు. మీడియా కూడా బాధ్యత కలిగి ప్రవర్తించాలంటూ పెద్ద క్లాసే తీసుకున్నారు.

సరే చెప్పాల్సిందంతా చెప్పేసి చివరకు శాపనార్ధాలు కూడా పెట్టేశారు. తప్పుడు వార్తలు రాసే మీడియాకు కరోనా తగలాలంటూ శాపనార్ధాలు కూడా పెట్టేశారు. ఇక్కడే కేసియార్ వైఖరి విచిత్రంగా ఉంది. ఒకవైపు వైరస్ ను తరిమేయాలని పోరాటం చేస్తూనే మళ్ళీ అదే వైరస్ సోకాలని మీడియాకు శాపం పెట్టటంపై కేసియార్ సమాధానం చెప్పాలి.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే మీడియాపై కేసియార్ చేసిన వ్యాఖ్యలను కనీసం తెలంగాణాలో మీడియా ప్రచురించే ధైర్యం కూడా చేయలేదు. మామూలుగా అయితే మీడియాకు వ్యతిరేకంగా ఎవరు ఎటువంట వ్యాఖ్యలు చేసినా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని చీల్చి చెండాడేస్తుంది మీడియా. మొదటి పేజీలో జర్నలిజంపై ఉక్కుపాదమని, మీడియాకు సంకెళ్ళనే హెడ్డింగులు పెట్టి రాసుకుంటాయి. కానీ ఇక్కడ కేసియార్ డైరెక్టుగానే తప్పుడు వార్తులు రాసే మీడయాను బొందపెడతానని వార్నింగ్ ఇచ్చినా కిక్కురుమనలేదు.

వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, బాధితులకు వైద్యం అందేంచేందుకు చేసిన ఏర్పాట్లను కేసియార్ వివరించారు. వైరస్ నియంత్రణకు తమ ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏ విధంగా కృషి చేస్తోందో వివరించారు. పనిలోపనిగా లాక్ డౌన్ పొడిగించాలన్న తన వాదనకు కారణాలు కూడా చెప్పారు. మొత్తం మీద కేసియార్ అంటే యావత్ మీడియా ఎంతగా భయపడుతోందో మరోసారి తెలిసిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి