iDreamPost

బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

మనలో బరువు తగ్గాలని ఎంతమంది అనుకుంటున్నారో బరువు పెరగాలని కూడా కొంతమంది కోరుకుంటున్నారు. అయితే చాల మంది బరువు తక్కువగా ఉండడానికి కారణాలు ముఖ్యంగా సరైన సమయానికి తినకపోవడం, వంశపార పర్యం వలన, మన శరీరం ఖర్చు పెట్టె క్యాలరీల కన్నా తక్కువ ఆహరం తినడం వలన కూడా బరువు పెరగరు. అందరు అనుకుంటారు కొన్ని రోజులు రోజూ జంక్ ఫుడ్ తింటే తొందరగా బరువు పెరుగుతారని, కానీ దానివలన మన శరీరంలో చెడు కొవ్వు పెరిగి రక్తపోటు, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బరువు పెరగాలని ఎవరైనా అనుకున్నవారు వారి ఫుడ్ డైట్ మార్చుకోవాలి.

బరువు పెరగాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి..

*ఉదయం లేవగానే నానబెట్టిన బాదం పప్పులు పది తినాలి.
*ఒక గంట తరువాత టిఫిన్ తినాలి.
*ఒక అరగంటకి ఏవైనా ఫ్రూట్స్ (అరటి పండు, ఆపిల్) తినాలి.
*ఇంకో గంట తరువాత పాలు తాగాలి, మరియు ఒక గుడ్డు తినాలి. పాలు ప్యాకెట్ వి కాకుండా విడిగా దొరికే పాలు మరియు నాటు గుడ్డు తింటే మంచిది.
*అన్నం తినే ముందు అస్సలు నీళ్లు తాగకూడదు, మరియు అన్నం తినేటపుడు కూడా ఎక్కువ నీళ్లు తాగకూడదు. నీళ్లు అన్నం తినే ముందు త్రాగితే కడుపు నిండినట్లుగా ఉంది తక్కువ అన్నం తింటారు.
*అలాగే లంచ్ కూడా కొంచెం ఎక్కువగా తినాలి. అన్నంలో కూడా ఎగ్ తినాలి.
*అన్నం తిన్న తరువాత పెరుగులో కొద్దిగా పంచదార కలుపుకొని తినాలి.
*సాయంత్రం పుట కూడా కచ్చితంగా టిఫిన్ తినాలి. మరియు డ్రై ఫ్రూట్స్ కూడా తినాలి.
*అలాగే నైట్ కచ్చితంగా డిన్నర్ తినాలి, తిన్నాక పాలు త్రాగాలి.
*ఈ విధంగా రోజూ మొత్తంలో రెండు గుడ్లు, రెండు సార్లు పాలు, రెండు సార్లు టిఫిన్, ఒకసారి భోజనం తినాలి.
*అయితే ఆహారంతో పాటుగా మన శరీరానికి వ్యాయామం కూడా చేయాలి అప్పుడే మనం ఇచ్చిన ఆహరం సరైన రీతిలో మన శరీరంలోని అన్ని అవయవాలకు అంది బరువు పెరుగుతాము.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి