iDreamPost

Cough: దగ్గు తగ్గడం లేదా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందడి!

సాధారణంగా మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నాా సీజనల్ వ్యాధులు బాధపెడుతూనే ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు మనిషిని శారకంగానే కాదు, మానసికంగా కూడా కృంగదీస్తుంటాయి.

సాధారణంగా మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నాా సీజనల్ వ్యాధులు బాధపెడుతూనే ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు మనిషిని శారకంగానే కాదు, మానసికంగా కూడా కృంగదీస్తుంటాయి.

Cough: దగ్గు తగ్గడం లేదా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందడి!

2020 లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజ గజలాడించింది. ఆ సమయంలో తుమ్మినా.. దగ్గినా చుట్టుపక్కల జనాలు భయంతో పక్కనుంచి జరిగేవారు. రెండేళ్లుగా కరోనా ప్రభావం పెద్దగా లేదు.. కానీ ఈ మధ్య మెల్లిగా మొదలైందని అంటున్నారు. సాధారణంగా శీతాకాల సమయంలో చిన్నా పెద్ద లేడా లేకుండా దగ్గు, జలుబు చాలా ఇబ్బంది పెడుతుంది. మీకు వచ్చే ఎలాంటి దగ్గు అయినా సరే భరించడం కష్టం. మీమ్ముల్ని మాత్రమే కాదు.. పక్కను ఉండేవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. దగ్గు, జలుబు అనేది అత్యంత ప్రమాదకరమైనది కానప్పటికీ, ఇది ఒకరి నుంచి మరొకరికి వెంటనే సోకే ప్రమాదం ఉంటుంది. వైద్యుల సలహాతో పాటు కొన్ని చిట్కాలు పాటించి తరుచూ వచ్చే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. వివరాల్లోకి వెళితే..

వర్షాకాలం, చలికాలంలో సీజనల్ వ్యాధులు చాలా ఇబ్బందులు పెడతాయి. వర్షాకాలంలో జ్వరం, డెంగ్యూ, మలేరియా ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి. చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటాయి. ముఖ్యంగా ఎక్కువగా దగ్గడం వల్ల చికాకు, శరీరం అలసిపోవడం, గొంతు నొప్పి ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు మనిషిని కుంగదీస్తుంది. మీకు ఎక్కువ సమయం దగ్గు వస్తున్నా.. ఛాతిపై మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. సాధారణంగా వైద్యులు దగ్గు నివారణ కోసం ఎక్కువగా సిరప్ లు రాస్తుంటారు. కానీ.. జలుబు, దగ్గు నుంచి కొన్ని చిట్కాలు పాటిస్తే సత్వరమే ఉపశమనం పొందవొచ్చు.. పూర్వ కాలం నుంచి మన పెద్దలు ఇలాంటి చిట్కాలు పాటించేవారు.

  • తులసి ఆకుల రసాన్ని తీసుకొని అందులో తగినంత తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
  • రెండు చెంచాల నూనె కాచి.. ఓ పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి భద్రపరచాలి. దీన్ని ఛాతికి, గొందుకి రాస్తే ఉపశమం ఉంటుంది.
  • నాలుగైదు తమలపాకులు వేడి చేసి నూరి ఆ రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే దగ్గు తగ్గుతుంది.
  • కొన్ని జామాయిల్ (యూకలిప్టస్) ఆకులను మరిగించి తర్వాత నీటిలో వడగట్టి అందులో పంచదార కలిపి మూడు పూటలా తాగితే దగ్గు తగ్గుతుంది.
  • దగ్గు బాగా ఉంటే రోజు రెండు పూటల గ్లాసు పాలలో అల్లం లేదా వెల్లుల్లి రసం వేసి మరిగించి అందులో పసుపు వేసి గోరువెచ్చగా తాగితే మంచి ఉపశమనం
  • నిత్యం దగ్గుతో బాధపడే వారు.. రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవొచ్చు
  • తిప్పితీగ రసం రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. వాత, పిత్త, కఫాల ఇబ్బంది తొలగిస్తుంది.
  • తేనె, దాల్చిన్ చెక్క, యష్టిమధురం పొడి గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే గొప్ప ఉపశమనం ఉంటుంది.
  • శోంఠిగా పిలిచే ఎండు అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. శొంఠిని తేనెలో కలిపి తీసుకంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • దానిమ్మ రసంలో కాస్త అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి రెండు పూటలా తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.
  • లవంగాలు నోట్లో వేసుకొని చప్పరిస్తూ దాని నుంచి వచ్చే రసం మింగాలి.. దీని వల్ల గర గర తగ్గుతుంది. గొంతు ఫ్రీ అవుతుంది.
  • వామును నలిపి దవడకు వేసుకొని చప్పరించాలి.. ఇలా చేస్తే దగ్గును కొంతమేర తగ్గిస్తుంది.
  • ఉదయం పూట చెంచా తేనలో చిటికడు మిరియాల పొడి కలిపి తాగితే చాలా వరకు దగ్గు, జలుబు నయం అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి