iDreamPost

సినిమాల్లో ఎక్కువగా చనిపోయిన హీరో ఎవరో తెలుసా..?

ఓ సినిమాకు రియల్ హీరో కథే. సినిమా స్టోరీని బట్టి ఏ హీరోకి సెట్ అవుతుందీ.. అనేది ఆ తర్వాత నిర్ణయిస్తారు. కొంత మంది కథా రచయితలు.. కొంత మంది హీరోలను ఊహించుకుని సినిమా రాసుకుంటారు కానీ.. ఆచరణలో అది సాధ్యం కాకపోవచ్చు. ఏదైమైనా హీరో ఉంటేనే కథ పట్టాలు ఎక్కుతుంది. అయితే..

ఓ సినిమాకు రియల్ హీరో కథే. సినిమా స్టోరీని బట్టి ఏ హీరోకి సెట్ అవుతుందీ.. అనేది ఆ తర్వాత నిర్ణయిస్తారు. కొంత మంది కథా రచయితలు.. కొంత మంది హీరోలను ఊహించుకుని సినిమా రాసుకుంటారు కానీ.. ఆచరణలో అది సాధ్యం కాకపోవచ్చు. ఏదైమైనా హీరో ఉంటేనే కథ పట్టాలు ఎక్కుతుంది. అయితే..

సినిమాల్లో ఎక్కువగా చనిపోయిన హీరో ఎవరో తెలుసా..?

సినిమా తీస్తున్నారు అంటే.. ముందుగా అడిగే ప్రశ్న.. ఈ మూవీకి హీరో ఎవరూ అని. సినీ మాయలోకం మొదలైన నాటి నుండి హీరోయిజమే చలామణి అవుతూ పోతుంది. కథానాయకుడు లేని చిత్రం.. తలకాయ లేని శరీరంలా ఉంటుందని జనాలు సైతం ఫిక్స్ అయిపోయారు. ఇక హీరో అంటే కచ్చితంగా ఫైట్స్ చేయాలి, కామెడీతో కితకితలు పెట్టించాలి, హీరోయిన్స్‌తో లవ్, రొమాన్స్, డ్యూయెట్స్ పాడాల్సిందే. అదే కథానాయకుడు లవ్ ఫెయిల్యూర్ అయితే.. తట్టుకోలేరు ప్రేక్షకులు. అలాంటిది హీరో చనిపోయిన క్యారెక్టర్లతో నటిస్తే.. హృదయం బద్దలు అవుతుంది. అస్సలు జీర్ణించుకోలేరు. కానీ ఓ హీరో మాత్రం.. తన క్యారెక్టర్ చనిపోయినా మెప్పించాడు.

ఒకటి కాదూ రెండు కాదూ దాదాపు ఆరు సినిమాల్లో ఆ హీరో చనిపోతూనే ఉన్నాడు. పోనీ అతడు సైడ్ యాక్టర్ అనుకుంటున్నారేమో.. కానే కాదూ ఓ స్టార్ హీరో. టాలీవుడ్ ఇండస్ట్రీ యంగ్ స్టార్లలో అత్యధిక మూవీస్‌లో చనిపోయిన హీరో బహుశా అతడే కావచ్చు. ఇంతకు ఆ కథానాయకుడు ఎవరో తెలుసా.. కనీసం గెస్ చేయగలరా.. అంత రిస్క్ ఎందుకులేండి.. చెప్పేయండి అనుకుంటున్నారా.. అతడు ఎవరో కాదండి.. నాచురల్ స్టార్ నాని. ఇప్పటి వరకు నాని దాదాపు 35-38 సినిమాల్లో నటించగా.. అందులో ఆరు సినిమాల్లో అతడి క్యారెక్టర్ చనిపోతుంది. అస్సలు ఇలాంటివి హీరోలే కాదూ ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేయరు. నాని చేయడమే కాదూ మెప్పించి హిట్స్ కూడా కొట్టాడు. ఇంతకు ఆ మూవీలు ఏంటో చూద్దాం.

Naani

భీమిలీ కబడ్డీ జట్టు.. ఈ మూవీ నాని పోషించిన సూరి బాబు క్యారెక్టర్ చనిపోతుంది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ చనిపోతే.. కంటతడి పెట్టని వారుండరు. ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి మూవీ ఈగలో కూడా మనోడు స్వర్గానికి చేరుకుని, తిరిగి ఈగ రూపంలో దర్శనమిస్తాడని తెలిసిందే. జెండాపై కపిరాజు మూవీలో కూడా నాని మరణిస్తాడు. జెంటిల్ మెన్ మూవీలో నాని డ్యూయల్ రోల్ చేయగా.. అందులో ఓ క్యారెక్టర్ చనిపోతుంది. ఇక జెర్సీ మూవీలో అనారోగ్య సమస్యలతోనే చనిపోతాడు నాని. ఈ మూవీ కూడా హిట్టైన సంగతి విదితమే. శ్యామ్ సింగరాయ్‌లో కూడా టైటిల్ పేరుతో ఉన్న క్యారెక్టర్ కూడా డెత్ అవుతుంది. ఈ లిస్ట్ చూస్తుంటే.. వామ్మో నిజంగా ఇన్ని మూవీస్‌లో నాని పోషించిన క్యారెక్టర్ మరణించాయా అనిపించకమానదు. మరీ మీకు తెలిసిన నటుడి స్పెషల్ ఏదైనా ఉందంటే.. మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి