iDreamPost

‘యానిమల్’ సినిమాలో నటించిన నర్స్ ఎవరో తెలుసా?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ సింగ్, రష్మిక, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘యానిమల్’ భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో ప్రతి పాత్ర ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ సింగ్, రష్మిక, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘యానిమల్’ భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో ప్రతి పాత్ర ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

‘యానిమల్’ సినిమాలో నటించిన నర్స్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం సినిమా పరంగా ప్రతి చోట వినిపిస్తున్న పేరు ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో.. తమ ఫాల్లోవర్స్ ను పెంచుకున్న యాక్టర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న,అనిల్ కపూర్, బాబి డియోల్, దీప్తి డిమ్రి , బబ్లూ పృథ్వీరాజ్ ,  శక్తి కపూర్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించింది. ‘యానిమల్’ వీరందరికి ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించిపెట్టింది. అయితే, ఈ సినిమాలో నర్స్ పాత్రలో నటించిన దీప్తి పాటిల్ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వస్తుంది.  ఆమె గురించి సెర్చింగ్ మొదలుపెట్టారు అభిమానులు. అసలు ఈ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం..

దీప్తి పాటిల్ ముంబైలోని ఓ పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది. టెలివిజన్ ఇండస్ట్రీ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది. 2018లో పాపులర్ స్టార్ ప్లస్ షో అయిన “యే హై మొహబ్బతేన్” తో బుల్లితెరకు పరిచయం అయింది. ఆ షో తరువాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కాగా “యే రిష్టే హై ప్యార్ కే” ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె పలు పౌరాణిక, క్రైమ్ షోలలో నటించింది. అలా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి పాటిల్ ను .. డైరెక్టర్ సందీప్ వంగా యనిమాల్ చిత్రంలోని నర్స్ పాత్రకు ఆడిషన్స్ తీసుకుని ఎంపిక చేశారు. ఇక ఈ మూవీతో ఆమె పాపులర్ అయ్యింది. దీప్తి పాటిల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ, తరచూ తనకు సంభందించిన ఫోటోలు, రీల్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ‘యానిమల్’ తరువాత ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఓ రకంగా ఈ చిత్రంతో దీప్తి పాటిల్ కు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు.

ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికి 36 k కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ భామకు సినిమా అవకాశాలు విపరీతంగా వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా, ‘యానిమల్’ చిత్రం ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సంపాదిస్తూ.. అటు చిత్రంలోని నటీ నటులకు కూడా మంచి గుర్తింపును సంపాదించి పెడుతుంది. చిన్న చిన్న పాత్రలు పోషించిన వారు కూడా తమ నటనతో ప్రత్యేకమైన అభిమానులను వారి సొంతం చేసుకుంటున్నారు. ఇక యానిమల్ చిత్రంతో వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని.. మంచి పాత్రలు చేయాలని దీప్తి పాటిల్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి, ‘యానిమల్’ చిత్రంలో నర్స్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుని.. పాపులర్ అవుతోన్న ‘దీప్తి పాటిల్’ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి