iDreamPost
android-app
ios-app

ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? గుండుతో ఇలా మారిపోయింది ఏంటి?

  • Author Soma Sekhar Published - 03:25 PM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Published - 03:25 PM, Sat - 19 August 23
ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? గుండుతో ఇలా మారిపోయింది ఏంటి?

సాధారణంగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన తర్వాత హీరోయిన్ లు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటారు. అయితే వారు ఇండస్ట్రీకి దూరం అవుతారు కానీ అభిమానులకు మాత్రం కాదు. అభిమానులతో వారు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ ఉంటారు. వారికి సంబంధించిన ఫొటోలను విషయాలను ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా ఒకప్పటి హీరోయిన్, కొరియోగ్రాఫర్, దర్శకనిర్మాత చేసిన ఈమె తన తాజాగా ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. గుండు కొట్టించుకుని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ నటి. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీని మీరు గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో గుండుతో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా? తమిళనాడులో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ హీరోయిన్ గా అరంగేట్రం చేసింది మాత్రం తెలుగులోనే. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిగా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదండోయ్ బాబు ఈ అమ్మడు కొరియోగ్రాఫర్ కమ్ దర్శకనిర్మాత కమ్ పొలిటిషీయన్ కూడా. ఇప్పటికైనా ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? గుండు కొట్టించుకుని గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ బ్యూటీ ఎవరో కాదు.. గాయత్రి రఘురామ్. 2001లో వచ్చిన ‘రేపల్లే రాధ’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమ్మడుకి పేరు తెచ్చింది మాత్రం 2003లో వచ్చిన ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’.

ఈ మూవీలో గాయత్రి యాక్టింగ్ కు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలోని ‘మాటలే రాని వేళ పాట ఎలా పాడను’ సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు అనుకున్నంత పాపులారిటీ రాలేదు. దీంతో 2004 నుంచి 2010 వరకు గాయత్రి నుంచి ఒక్క మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దాంతో కొన్ని ప్రత్యేక గీతాల్లో నటించింది కూడా. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? గాయత్రి హీరోయిన్ గా కంటే కొరియోగ్రాఫర్ గానే ఎక్కువగా సినిమాలు చేసింది. చివరిగా 2021లో వచ్చిన రంగ్ దే సినిమాలో హీరోకి సోదరిగా నటించింది. ఈ మూవీ తర్వాత సినిమాకు రిటైర్మెంట్ ప్రకటించింది.

కాగా.. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే దీపక్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని 2006లో పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. 2010లో అతడికి విడాకులిచ్చింది. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014లో బీజేపీ పార్టీలో చేరింది. దాదాపు 8 సంవత్సరాలు పార్టీలో ఉండి ఈ ఏడాది జనవరిలో పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గాయత్రి స్వామివారికి తలనీలాలను సమర్పించుకుంది. 10 సంవత్సరాల క్రితం మెుక్కిన మెుక్కు అంటూ రాసుకొచ్చింది. ఆ సంద్భంగా దిగిన ఫొటోలను, వీడియోలు తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దాంతో ఎంతో అందంగా ఉండే గాయత్రి ఇలా మారిపోయింది ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి పొలిటిషీయన్ గా, డైరెక్టర్ గా, హీరోయిన్ గా మల్టీటాలెంటెడ్ కలిగిన ఈమె ఇంతలా మారిపోయిందేంటి? ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి మీలో ఎంత మంది ఈ నటిని చూడగానే గుర్తుపట్టారో కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Gayathri Raguramm (@gayathriraguramm)


ఇదికూడా చదవండి: నాని చేసింది తప్పు కాకపోవచ్చు! శర్వా మాత్రం తప్పు చేయలేదు!

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş