iDreamPost

PAN India Movies : పాన్ ఇండియా సినిమాలకు టెన్షన్ తప్పదా

PAN India Movies : పాన్ ఇండియా సినిమాలకు టెన్షన్ తప్పదా

అఖండకు వస్తున్న కలెక్షన్లు సంతోషించాలో లేక మళ్ళీ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నందుకు ఆందోళన చెందాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. థియేటర్లకు జనం భారీగా తరలి వస్తున్న దృశ్యం కళ్ళముందు కనిపిస్తోంది. కానీ జనవరి నుంచి కేసులు పెరగొచ్చని హెచ్చరిస్తున్న ప్రభుత్వ వర్గాల సమాచారం చూసి పాన్ ఇండియా నిర్మాతలకు మరోసారి టెన్షన్ మొదలయ్యింది. 2022 సంక్రాంతి నుంచి సిచువేషన్ సీరియస్ గా మారొచ్చన్న సంకేతాలు వస్తున్న తరుణంలో ఇది కలెక్షన్ల మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ మేకర్స్ కి భవిష్యత్తులో ఇవి ఆందోళన కలిగించే పరిణామాలే.

ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు థియేటర్లకు వచ్చేందుకు వెనుకాడటం లేదు. పూర్తి స్థాయిలో కాకపోయినా మాస్ ప్రేక్షకులు కుటుంబాలతో కలిసి హాళ్లకు వస్తున్నారు. ఇది కంటిన్యూగా జరగాలి. పుష్పకున్న క్రేజ్ కు ఎలాగూ ఈ ట్రెండ్ కొనసాగుతుంది. కాకపోతే అప్పటికల్లా వైరస్ తీవ్రత పెరగకుండా ఉంటే చాలు. మహారాష్ట్రలో 12 ఓమిక్రాన్ కేసులు వచ్చాయి. ఇవి పెరిగితే మంచిది కాదు. తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు మూసివేయనివ్వమని హామీ ఇస్తున్నప్పటికీ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. నగరాల్లో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఓమిక్రాన్ ప్రమాద తీవ్రత ఎంతో ఎవరికీ తెలియదు.

వ్యాక్సిన్ వేసుకున్నా కూడా సోకాదన్న గ్యారెంటీని దొరకడం లేదు. పైగా బూస్టర్ డోస్ ని కొత్తగా మరొకటి తీసుకోమన్న రికమండేషన్లు ఎక్కువయ్యాయి. పాన్ ఇండియా సినిమాలకు కనీసం మూడు వారాల రన్ దక్కితే వాటి పెట్టుబడులు సేఫ్ అవుతాయి. అలాంటప్పుడు జనవరిలో కేసులు పెరిగితే పబ్లిక్ లో మళ్ళీ భయం పెరిగి థియేటర్లకు రావడం గురించి పునరాలోచనలో పడతారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం జనంలోనూ ఉంది. ఎటొచ్చి పరిణామాలు అంచనా వేయలేక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. వేచి చూడటం తప్ప ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది

Also Read : Maanaadu / The Loop : మానాడు మీద మనసు పారేసుకున్న టాలీవుడ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి